ఢిల్లీ కాలుష్యం కారణంగా జైపూర్‌కు సోనియా గాంధీ.. అప్పటి వరకు అక్కడే

By Mahesh K  |  First Published Nov 14, 2023, 6:49 PM IST

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఢిల్లీ కాలుష్యం వల్ల రాజధాని నగరం వీడి జైపూర్‌కు తాత్కాలికంగా వెళ్లుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత తగ్గిపోయాక మళ్లీ వస్తారు. 
 


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పతాకస్థాయికి చేరుకుంటున్నది. అధిక కాలుష్యపూరిత ప్రాంతాల్లో స్వేచ్ఛగా గాలి పీల్చుకున్న ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే స్థాయిలో ఈ కాలుష్యం ఉన్నది. దేశాన్ని పాలించే అధినేతలు, నాయకులు ఉండేదీ ఇదే ఢిల్లీలో. కానీ, అనేక కారణాల రీత్యా ప్రతి ఏడాది కనీసం మూడు మాసాలైనా ఢిల్లీ నగరం కాలుష్య కాసారంగా మారిపోతున్నది. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఢిల్లీ వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే కారణంతో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజధాని నగరాన్ని వీడి రాజస్తాన్ రాజధాని జైపూర్‌కు వెళ్లుతున్నారు.

ఆమె అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారాం హాస్సిటల్‌లో రెండు నెలల క్రితం చికిత్స తీసుకున్నారు. రెండు నెలలు గడిచిన తర్వాత వైద్యుడి సలహా మేరకు ఆమె తాత్కాలికంగా ఢిల్లీ వదిలి జైపూర్‌కు వెళ్లిపోతున్నారు. ఢిల్లీలో గాలిలో కాలుష్య తీవ్రత తగ్గిపోయిన తర్వాత మళ్లీ తిరిగి రానున్నారు. కాలుష్యం కారణంగా సోనియా గాంధీ ఢిల్లీ వదిలివెళ్లడం ఇదే తొలిసారి కాదు. 2020 శీతాకాలంలో ఆమె వైద్యుల సూచనల మేరకు గోవాకు వెళ్లారు.

Latest Videos

Also Read : పోలీసులను ఇసుక ట్రాక్టర్లు తొక్కి చంపడం కొత్తేం కాదు: బిహార్ మంత్రి షాకింగ్ కామెంట్లు

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మంగళవారం 375గా ఉన్నది. ఇది సివియర్ కేటగిరీలో ఉంటుంది. అదే జైపూర్‌లో ఏక్యూఐ 72గా ఉన్నది. ఇది మాడరేట్ కేటగిరీ.

అనారోగ్యంతో సోనియా గాంధీ సెప్టెంబర్ నెలలో సర్ గంగారాం హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. ఒక రోజు తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతకు ముందు జనవరిలోనూ ఆమె శ్వాసకోశ సంబంధ సమస్యలతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.

రాహుల్ గాంధీ పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల క్యాంపెయిన్‌లో ఉన్నారు. మంగళవారం రాత్రి ఆయన జైపూర్‌కు వెళ్లుతారు. ఆ తర్వాతి రోజు ఛత్తీస్‌గడ్‌కు వెళ్లుతారు. ఆ తర్వాత జైపూర్‌కు వెళ్లి గురువారం నాటి షెడ్యూల్‌ ప్రకారం అక్కడే ప్రచారం చేస్తారు.

click me!