పోలీసులను ఇసుక ట్రాక్టర్లు తొక్కి చంపడం కొత్తేం కాదు: బిహార్ మంత్రి షాకింగ్ కామెంట్లు

By Mahesh K  |  First Published Nov 14, 2023, 6:04 PM IST

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ అడ్డు వచ్చిన పోలీసు సిబ్బందిపైకి దూసుకెళ్లింది.  వారిని తొక్కుకుంటూ వెళ్లిపోగా.. ఒక హోం గార్డ్ తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి తీవ్ర గాయాలై హాస్పిటల్ వెళ్లేలోపే మరణించాడు.
 


పాట్నా: బిహార్‌లో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అక్రమంగా ఇసుకును రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ అడ్డుగా వచ్చిన పోలీసులను తొక్కుకుంటూ వెళ్లిపోయింది. ఓ హోం గార్డు సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ చేర్చారు. అయితే.. హాస్పిటల్ చేరే లోపే ఒకరు మరణించగా.. హోం గార్డు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బిహార్‌లోని జాముయి జిల్లా మహులియా టాండ్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.

‘ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. గతంలోనూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో ఇలాంటి ఘటనలు జరిగాయి’ అని మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని చెప్పారు.

Latest Videos

ఈ ఘటనతో ప్రమేయం ఉన్న నిందితుడు మిథిలేశ్ కుమార్‌ను అరెస్టు చేశామని, ఆ ట్రాక్టర్ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని జాముయి జిల్లా ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు. ఈ ఘటన రాజకీయ దుమారం రేపింది. 

Also Read: కేంద్ర మంత్రి పియుశ్ గోయల్‌కు ఎలన్ మస్క్ క్షమాపణలు.. ఎందుకంటే?

జాముయి ఎంపీ చిరాగ్ పాశ్వాన్ బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు సంధించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని ఫర్ అయ్యారు. ఈ అక్రమ ఇసుక రవాణా కారణంగా నదుల్లో ప్రజలు మునిగి చనిపోతున్నారని అన్నారు. 

click me!