ఒకప్పుడు ఎల్ఐసీ ఏజెంట్.. 60 ఏండ్ల వయసులో కోట్ల సంపాదన.. లచ్మన్ దాస్ మిట్టల్ సక్సెస్ స్టోరీ ఇది

By Mahesh Rajamoni  |  First Published Sep 5, 2023, 3:58 PM IST

విజయం సాధించడానికి వయసుతో సంబంధం లేదున్న సంగతని మనం లచ్మన్ దాస్ మిట్టల్ ను చూసి అర్థం చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అయ్యే వయసులో సోనాలికా ట్రాక్టర్స్ అనే గ్లోబర్ బ్రాండ్ ను నిర్మించాడు. ఈ బ్రాండ్ 74 దేశాలకు విస్తరించింది.


చాలా మంది రిటైర్మెంట్ వయసు వచ్చిందంటే ఏ పనిచేయకుండా అలా సంతోషంగా గడపాలనుకుంటారు. విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. కానీ 60 ఏండ్ల లచ్మన్ దాస్ మిట్టల్ మాత్రం ఇలా ఇప్పటికీ అనుకోలేదమో.. అందుకే సాధారణ జీవితం నుంచి కోట్ల సంపాదించే స్టేజ్ కు వెళ్లాడు. విజయాన్ని సాధించడానకి వయసుతో సంబంధం లేదన్న నిజాన్ని లోకానికి చాటాడు. 

లచ్మన్ దాస్ మిట్లల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవాడు. ఆ సమయంలోనే మిట్టల్ కు ఆర్థిక అంశాలపై బాగా అవగాహన పెరిగింది. బ్యాంకు ఖాతాల సంప్రదాయ భద్రతకు బదులుగా వివిధ పథకాలు, మ్యూచువల్ ఫండ్లలో తెలివిగా ఇన్ఫెస్ట్ చేయడం వైపు మొగ్గు చూపాడు. ఇదే అతనికి మంచి విజయాన్ని అందించింది. 

Latest Videos

1995 లో పంజాబ్ లో సోనాలికా ట్రాక్టర్స్ ను స్థాపించిన మిట్టల్ ఎల్ఐసీ నుంచి వైదొలిగి వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించాడు. దీంట్లో ఆయనకు కష్టాలు ఎదురుకాకతప్పలేదు. వ్యవసాయ యంత్రాల రంగంలో ప్రారంభంలో జరిగిన పొరపాట్లు ఆయన దివాలా పడేలా చేశాయి. ఇది ఇతని పెట్టుబడులను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా చేసింది. అయినా మిట్టల్ ఏ మాత్రం బయపడకుండా స్ఫూర్తితో సమస్యలను, సవాళ్లను ఎదుర్కొన్నాడు.

గోధుమలు, గడ్డి వేరు చేయడానికి ఉపయోగించే జపనీస్ యంత్రాలు మిట్టల్ కు జీవితాన్ని ఒక మలుపు తిప్పాయి. ముఖ్యంగా త్రెషర్లపై దృష్టి సారించిన ఆయన ఎనిమిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ట్రాక్టర్ల తయారీ  మొదట్లో అతని ప్రణాళికలలో లేనప్పటికీ.. మార్కెట్ డిమాండ్ల కారణంగా ఇది కేంద్రంగా మారింది.

undefined

ట్రాక్టర్ల తయారీకోసం అతనికి ఆర్థిక అవసరం ఎంతో వచ్చింది. తన డీలర్ల నమ్మకంతో అతను రూ .22 కోట్ల పెద్ద రుణాన్ని పొందాడు. ఇది సోనాలికా ట్రాక్టర్స్ కు అపూర్వ విజయాన్ని సాధించిపెట్టింది. ప్రస్తుతం పంజాబ్ లోని జలంధర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సోనాలికా ఉత్పత్తులు 74 దేశాలకు చేరుకున్నాయి. ఆర్థిక సంవత్సరం 2022లో 1,00,000 మైలురాయిని సాధించిన తర్వాత, ఆర్థిక సంవత్సరం 2023లో 1,51,160కి చేరుకుంది. 

ఫోర్బ్స్ ప్రకారం.. మిట్టల్ 2.6 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత వృద్ధ బిలియనీర్ గా నిలిచారు. ఎల్ఐసీ అధికారి నుంచి గ్లోబల్ ట్రాక్టర్ మాగ్నెట్ గా ఎదిగిన మిట్టల్ ప్రయాణం కలలను సాకారం చేసుకోవడానికి వయసు అడ్డు కాదనే విషయాన్ని లోకానికి చాటాడు. ఈయన కథ ఎందరికో ఆదర్శం.
 

click me!