తండ్రిని హతమార్చి శరీరాన్ని 32 ముక్కలు చేసి బోర్‌వెల్‌లో పడేసిన కొడుకు.. కర్ణాటకలో ఘటన

Published : Dec 13, 2022, 05:11 PM IST
తండ్రిని హతమార్చి శరీరాన్ని 32 ముక్కలు చేసి బోర్‌వెల్‌లో పడేసిన కొడుకు.. కర్ణాటకలో ఘటన

సారాంశం

ఢిల్లీలో శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తీరులోనే కర్ణాటకలోనూ గత మంగళవారం మర్డర్ జరిగింది. బగల్‌కోట్‌లో తండ్రిని చిన్న కొడుకు కోపంలో ఐరన్ రాడ్‌తో కొట్టాడు. తండ్రి మరణించాడు. ఆ తర్వాత అతడి శరీరాన్ని 32 భాగాలుగా ఖండించాడు. వాటిని ఓపెన్ బోర్‌వెల్‌లో వేశాడు.  

బెంగళూరు: ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్యతీరు ప్రతి ఒక్కరినీ ఖంగుతినిపించింది. తాజాగా, ఇదే రీతిలో కర్ణాటకలో ఓ హత్య జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టడంతో కుప్పకూలిన తండ్రిని 32 ముక్కలు చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోనే ఉన్న  ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను వేసినట్టు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన వెలుగులోకి రాగానే పోలీసులు వెంటనే యాక్షన్‌లోకి దిగారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రొక్లెయిన్‌లను తెచ్చారు. ఆ ఓపెన్ బోర్‌వెల్‌ను తవ్వించారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటన కర్ణాటకలోని బగల్‌కోట్‌లో చోటుచేసుకుంది.

Also Read: నేను ఇప్పుడు చిన్న పాపను కాదు.. అడల్ట్‌ను: శ్రద్ధా వాకర్ చివరి మాటలు వెల్లడించిన తండ్రి

పరశురామ్ కులాలీ రోజూ మద్యం సేవిస్తాడు. అతనికి ఇధ్దరు పిల్లలు. పెద్ద కుమారుడు తల్లితో కలిసి వేరుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు పరశురామ్ కలిసి ఉంటున్నారు. ప్రతి రోజు లిక్కర్ తాగి వచ్చిన చిన్న కొడుకు వితలను పరశురామ్ కులాలీ దూషించేవాడు. గత మంగళవారం కూడా పరశురామ్ వితలను దూషించాడు. కానీ, అప్పుడు వితల మరింక ఏమాత్రం భరించలేని స్థితికి వెళ్లాడు. వెంటనే ఓ ఐరన్ రాడ్ చేతిలోకి తీసుకుని తండ్రిని బాదాడు. ఆ దెబ్బతో తండ్రి కుప్పకూలిపోయాడు.

పరశురామ్ మరణించాడని నిర్దారించుకున్నాక వితల తండ్రి డెడ్ బాడీని 32 భాగాలుగా కట్ చేశాడు. వాటిని వారి సొంత సాగు భూమిలోని ఓపెన్ బోర్‌వెల్‌లో వేశాడు. బగల్‌కోట్ జిల్లాలోని ముధోల్ శివారులో మంతూరు బైపాస్ దగ్గర ఈ ఓపెన్ బోర్ వెల్ ఉన్నది.

PREV
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial