చీపురుకట్టతో కన్నతల్లిని చితకబాదిన కొడుకు

sivanagaprasad kodati |  
Published : Dec 09, 2018, 03:58 PM IST
చీపురుకట్టతో కన్నతల్లిని చితకబాదిన కొడుకు

సారాంశం

చెడు అలవాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దంటూ చెప్పిన తల్లిని చీపురుకట్టతో చితకబాదాడు కొడుకు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు చెన్నమ్మకెరెకు చెందిన జీవన్ డిగ్రీ చదువుతున్నాడు

చెడు అలవాట్లతో జీవితం నాశనం చేసుకోవద్దంటూ చెప్పిన తల్లిని చీపురుకట్టతో చితకబాదాడు కొడుకు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరు చెన్నమ్మకెరెకు చెందిన జీవన్ డిగ్రీ చదువుతున్నాడు.. చిన్నప్పటి నుంచి దురలవాట్లుతో పాటు ప్రేమ వ్యవహారాలతో నిత్యం ఇంట్లో వాళ్లకి మన:శాంతి లేకుండా చేసేవాడు.

ఈ క్రమంలో ఒక రోజు ప్రేమిస్తున్న యువతిని ఇంటికి తీసుకువచ్చి తల్లి ఎదుటే సిగరెట్లు తాగాడు. ఇప్పటి వరకు అతని చేష్టలు మౌనంగా భరించిన తల్లి.. తన కొడుకు కళ్లముందే నాశనమవుతుండటాన్ని జీర్ణించుకోలేక కుమారుడిని మందలించింది.

ఇప్పటి వరకు తనను పెల్లెత్తు మాట కూడా అనని తల్లి తనను మందలించడాన్ని తట్టుకోలేకపోయాడు. తనకు దగ్గర్లో ఉన్న చీపురుకట్టతో కన్నతల్లిని చితకబాదాడు...తన జోలికి వస్తే ఫలితం ఇలాగే ఉంటుందంటూ మరింత తీవ్రంగా కొట్టాడు.

ఈ తతంగం మొత్తాన్ని కుటుంబసభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది వైరల్ అవుతోంది. వీడియోను సుమోటాగా స్వీకరించిన పోలీసులు జీవన్‌పై కేసు నమోదు చేశారు. కొడుకుకు బుద్ది వచ్చేలా చేయాలంటూ తల్లి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!