సోషల్ మీడియా సంస్థలు వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నాయి: రాజీవ్ చంద్రశేఖర్

By Sree sFirst Published May 31, 2020, 10:04 PM IST
Highlights

సోషల్ మీడియా సంస్థలు ఇన్ని రోజులు వారిపైన ఎటువంటి కట్టడి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాయని, అవి పౌరుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించి వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ట్విట్టర్ మధ్య నెలకొన్న వివాదం మరోసారి సోషల్ మీడియా సంస్థల ఎలాంటి నియమాలను పాటించి కంటెంట్ ని పబ్లిష్ చేస్తున్నాయి, ఏ కంటెంట్ ని ఫిల్టర్ చేస్తున్నాయి అనే విషయంపై మరోసారి అందరి దృష్టి పడింది. 

సోషల్ మీడియా సంస్థలు ఇన్ని రోజులు వారిపైన ఎటువంటి కట్టడి లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించాయని, అవి పౌరుల వాక్ స్వాతంత్య్రాన్ని హరించి వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు బీజేపీ రాజ్యసభ ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్. 

సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ సాంకేతికంగా వాడుతున్న అల్గోరిథముల వల్ల కొన్ని పోస్టులను ఎక్కువమందికి చేరేలా చేయవచ్చు, లేదా దాన్ని అణిచిపెట్టి కూడా ఉంచొచ్చని, ఇది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన వాక్ స్వాతంత్య్రాన్ని ముఖ్యంగా ట్విట్టర్ వంటి సంస్థలు హరించి వేస్తున్నాయని ఈటీవీ భారత్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు. 

ఇలా సోషల్ మీడియా సంస్థలు తాము వ్యక్తుల ట్వీట్ల విషయంలో జోక్యం చేసుకోమని చెబుతుంటాయని, అంతా సాంకేతికంగా అభివృద్ధి చేసిన అల్గోరిథంలు మొత్తం చూసుకుంటాయని చెబుతారని, కానీ అందులో వాస్తవం లేదని అంటారు రాజీవ్ చంద్రశేఖర్. 

అల్గోరిథములను కూడా మానునుషులే తయారుజేస్తారు కాబట్టి ఆ వ్యక్తి ఆ అల్గోరిథమును తమకు కావలిసిన రీతిలో మార్చుకోవచ్చు కదా అని అందులోని మర్మాన్ని బయటపెట్టారు రాజీవ్ చంద్రశేఖర్.

సాంకేతికంగా మనం అభివృద్ధి చెందుతున్న తరుణంలో సాంకేతికత అత్యవసరం, కానీ ఆ సాంకేతికతకు కూడా జవాబుదారీతనం ఉండాలంటారు రాజీవ్ చంద్రశేఖర్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఏకంగా కొన్ని మీడియా సంస్థలపై, సోషల్ మీడియా జెయింట్లపై ఫేక్ న్యూస్ ను వ్యాప్తి చేస్తున్నారని, వాక్ స్వాతంత్య్రాన్ని హరించివేస్తున్నారని ఆరోపణలు చేసారు. 

ట్రంప్ వ్యాఖ్యలను గనుక పరిశీలిస్తే... ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సోషల్ మీడియా సంస్థలు తమ ఓనర్ల, సీఈఓల సైద్ధాంతిక అజెండాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి అనే ఒక ప్రచారానికి పర్యవసానం అని అన్నారు. 

భారత్ లో వాక్ స్వతంత్రంపై కేవలం అత్యవసరమైన ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కొన్ని ఆంక్షలు ఉంటాయని, వేరే ఏ సమయంలో కూడా రాజ్యాంగం కల్పించిన ఈ ప్రాథమిక హక్కుకు ఎటువంటి భంగం కలగదని అన్నారు రాజీవ్ చంద్రశేఖర్. 

సోషల్ మీడియా సంస్థల ప్రాధాన్యం ప్రస్తుత కాలంలో బాగా పెరిగిందని, అవి ఎన్నికల ఫలితాలను నిర్దేశించడమే కాకుండా ఒక దేశ వాణిజ్యాన్ని కూడె నిర్దేశించే స్థాయికి చేరుకున్నాయని, అవి వాటి వ్యాపారం నిర్వహించుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరం లేదని కానీ వాటిపై ఒక కన్నేయకుండా వాటిని అలా వదిలేస్తే మాత్రం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి ఆ సంస్థలు ఎక్కడా కూడా ఎటువంటి అనవసరపు విషయాల జోలికి వెళ్లకుండా ఉండేలా ప్రభుత్వం ఒక కన్నేసి ఉంచాలని అన్నారు రాజీవ్ చంద్రశేఖర్. 

click me!