కోలుకుంటున్న స్నేక్ మ్యాన్.. 300సార్లు పాము కాటేసినా.. బతికిన మృత్యుంజయుడు

Published : Feb 03, 2022, 12:54 PM IST
కోలుకుంటున్న స్నేక్ మ్యాన్.. 300సార్లు పాము కాటేసినా.. బతికిన మృత్యుంజయుడు

సారాంశం

సురేష్ ను మరో రెండు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. కేరళలో స్నేక్ క్యాచర్ గా పేరు గాంచిన సురేష్ ఇప్పటివరకు 50,000లకు పైగా పాములను రక్షించారు. సురేష్ నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానెల్ లలో కూడా పలు వీడియోలు చేశారు. 

రళ : ప్రముఖ స్నేక్ క్యాచర్  Vava Suresh నాగుపాము కాటు నుంచి ఎట్టకేలకు కోలుకున్నారు. కొట్టాయం వైద్య కళాశాలలో ventilator మీద చికిత్స పొందిన సురేష్ తనంతట తానుగా శ్వాస తీసుకోవడం ప్రారంభించాడని, అతని ఆరోగ్య పరిస్థితిలో మెరుగుదల కనిపించిందని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ టికె జయకుమార్ తెలిపారు. 

సురేష్ ను మరో రెండు రోజులపాటు అబ్జర్వేషన్ లో ఉంచుతామని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. కేరళలో స్నేక్ క్యాచర్ గా పేరు గాంచిన సురేష్ ఇప్పటివరకు 50,000లకు పైగా పాములను రక్షించారు. సురేష్ నేషనల్ జియోగ్రాఫిక్, యానిమల్ ప్లానెట్ ఛానెల్ లలో కూడా పలు వీడియోలు చేశారు. 

పాములు పట్టడంలో నిష్ణాతుడు వావా సురేష్. పామును పట్టేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టడం అతని నైజం. ఎంతో చాకచక్యంగా పాములు పట్టి ‘Snake man of Kerala’గా పేరు తెచ్చుకున్నాడు వావా సురేష్. అలాంటి వ్యక్తిని పట్టుకున్న పామే జనవరి 31న అనూహ్యరీతిలో కాటువేసింది. దాంతో ఆయన పరిస్థితి విషమంగా మారింది.

కేరళకు చెందిన వావాసురేష్ (48) కొట్టాయం జిల్లాలో పాములు పట్టడంలో చాలా ఫేమస్. తన వృత్తిలో భాగంగా సోమవారం Kurichi గ్రామంలో ఓ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు. దానిని పట్టుకుని గోనెసంచిలో వేస్తుండగా అది అతని మోకాలిపై కాటేసి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఆ కాటును లెక్కచేయకుండా సురేష్ ఆ పామును సంచిలో వేశాడు. వెంటనే కిందపడిపోయాడు.. దీంతో అది గమనించిన స్థానికులు అతనిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  

అయితే అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా ఉందని, యాంటి వెనం ఇస్తున్నామని  వైద్యులు తెలిపారు. ఎవరి ఇళ్లలోకి పాములు వచ్చినా.. వెంటనే ఫోన్ చేస్తే సురేష్ ఎక్కడికి వెళ్లి ఆ పాములను పట్టుకునే వాడు. అందరికీ, అన్నివేళలా అందుబాటులో ఉండేవాడు. దాంతో సురేష్ కేరళలో పాపులర్ అయ్యాడు.  పట్టుకున్న పాములను రక్షించి వాటిని అడవిలోకి వదిలేసేవాడు. ఇలా పాములను పట్టుకునే క్రమంలో 2020లో కూడా పాము కాటుకు గురయ్యాడు సురేష్. అప్పుడు  తిరువనంతపురంలోని ఒక ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో కొన్ని వారాల పాటు చికిత్స పొందాడు. సురేష్ ఇప్పటివరకు తనను 300సార్లు  పాము కాటు వేసిందని ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?