30 రూపాయల కోసం కస్టమర్ ను కత్తెరతో పొడిచిన టైలర్...

Published : Feb 03, 2022, 11:46 AM IST
30 రూపాయల కోసం కస్టమర్ ను కత్తెరతో పొడిచిన టైలర్...

సారాంశం

మరుసటి రోజు రోహిత్ వెళ్లగా.. రూ.30 అదనంగా ఇవ్వాలని అడిగాడు హరీష్. ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ప్యాంటు తీసుకుని తిరిగి వెల్తున్న అతని మీద కత్తెరతో దాడి చేశాడు. రోహిత్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. హరీష్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

ముంబయి : ముప్పై రూపాయలు ఎక్స్ ట్రా ఇవ్వలేదని ఓ కస్టమర్ ను దర్జీ Scissorsతో పొడిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ముంబయిలో అంధేరి ప్రాంతంలో మంగళవారం జరిగింది. హరీశ్ టకార్ అనే Tailor వద్దకు రోహిత్ యాదవ్ రెండు రోజుల క్రితం.. Pant మార్చి కుట్టాలని తీసుకువచ్చాడు. రూ. 100 కూలీగా మాట్లాడుకున్నారు. 

మరుసటి రోజు రోహిత్ వెళ్లగా.. రూ.30 అదనంగా ఇవ్వాలని అడిగాడు హరీష్. ఇందుకు రోహిత్ ససేమిరా అనడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగింది. ప్యాంటు తీసుకుని తిరిగి వెల్తున్న అతని మీద కత్తెరతో దాడి చేశాడు. రోహిత్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు. హరీష్ ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

ఇలాంటి ఘటనే నిరుడు అక్టోబర్ 22న కర్ణాటకలో చోటు చేసుకుంది. బెంగళూరు బనశంకరిలోని yarab nagarలో మహిళ టైలర్ అఫ్రినా ఖానం (28) హత్య కేసు మిస్టరీ వీడింది. మంగళవారం ఆమె ఇంట్లో చొరబడిన దుండగుడు కత్తెరతో పొడిచి చంపి మృతదేహంపై బట్టలు వేసి నిప్పుపెట్టి పరారయ్యారు. భర్త, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టగా పలు వాస్తవాలు బయటపడ్డాయి.

ఈ దారుణానికి కారణం ఆమె బంధువైన PUC student (17) నిందితుడని తేలింది. అఫ్రినా ఇంటి పక్కనే accused కుటుంబం కొత్తగా ఇల్లు కడుతుంది. ఈ క్రమంలో అబ్బాయి ఆమె ఇంటికి  తరచు వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య Extramarital affair ఏర్పడింది. ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లి జీవిద్దాం అని, హతురాలు ఆ అబ్బాయిని ఒత్తిడి చేయగా, అతడు నిరాకరించాడు. అంతేగాక డబ్బులు ఇవ్వాలని ఆమెను అతడు పీడించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.  

అబ్బాయి Scissors తీసుకుని ఆమెను పొడిచి చంపి పరారయ్యాడు.  పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. కాగా, అక్టోబర్ 20, బుధవారంనాడు పట్టపగలు ఇంట్లోకి చొరబడిన దుండగుడు ఒంటరిగా ఉన్న మహిళను కత్తెరతో పొడిచి చంపడం స్థానికంగా కలకలం రేపింది. yarab nagar 16వ క్రాస్ నివాసి టైలరింగ్ చేసే ఆఫ్రీనా ఖానం ఈ ఘటనలో మృతి చెందింది. ఆమెకు భర్త లాలూ ఖాన్ తో పాటు.. 3, 5 ఏళ్ల వయసు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు.

పిల్లలు ఆమె పుట్టింట్లో ఉంటున్నారు. భార్య ప్రవర్తనపై  అనుమానం వచ్చిన భర్త తరచుగా ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. భర్త ఓ టింబర్ డిపోలో పనిచేసేవాడు. హత్య జరిగిన రోజు కూడా గొడవ జరిగింది. భర్త పనికి వెళ్లి పోయిన కొంతసేపటికి ఒక వ్యక్తి వచ్చి అఫ్రినాతో గొడవకు దిగాడు. కొంతసేపటికి అక్కడే ఉన్న తీసుకొని ఆమెను పొడవడంతో తీవ్రగాయాలతో చనిపోయింది. దుండగుడు ఆమె మృతదేహంపై బట్టలు  కుప్పగా వేసి నిప్పంటించి వెళ్ళిపోయాడు. మంగళవారం సాయంత్రం ఇంట్లో నుంచి పొగలు వస్తుండగా స్థానికులు చూసి ఆమె సోదరికి, భర్తకు ఫోన్ చేశారు. 

వారు వచ్చి తలుపులు పగులగొట్టి, ఇంట్లోకి వెళ్లి  చూడగా  పరుపు, మృతదేహంపై  బట్టలు కాలిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని  పరిశీలించారు.  కేసు మీద దర్యాప్తు చేసిన పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?