రాజస్థాన్‌లో విషాదం.. విషపూరిత పాముకాటుతో ‘స్నేక్ మ్యాన్’ మృతి..

By Bukka SumabalaFirst Published Sep 14, 2022, 10:40 AM IST
Highlights

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఇరవై ఏళ్లుగా పాములను పట్టుకుంటూ పాము మనిషిగా ప్రసిద్ధి చెందిన వినోద్ తివారీ పాముకాటుతో మృతి చెందాడు.

జైపూర్ : రాజస్థాన్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చురు జిల్లాలో వినోద్ తివారీ అనే వ్యక్తి దాదాపు గత 20 ఏళ్లుగా పాములను పట్టుకుంటున్నాడు. పాములను పట్టుకున్న తర్వాత వాటిని అడవిలో వదిలి వెళ్లేవాడు. ఈ మేరకు స్థానికులు అతని గురించి చెబుతున్నారు. అయితే, ఈ క్రమంలో శనివారం విషపూరిత నాగుపామును పట్టుకునే సమయంలో దాని కాటుకు గురై తివారీ మృతి చెందాడు. అతని వయసు 45 ఏళ్లు.

ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శనివారం ఉదయం చురులోని గోగమేడి ప్రాంతంలోని ఓ దుకాణంలోకి వచ్చిన నాగుపామును పట్టుకోవడానికి తివారీ అక్కడికి వచ్చాడు. దుకాణం వెలుపల ఉన్న నాగుపామును పట్టుకుని, దాన్ని సంచిలో వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పాము అతని వేలి మీద కాటు వేసింది. ఇదంతా అక్కడి సీసీటీవీ వీడియోలో రికార్డ్ అయ్యింది.  అతను పట్టుకున్న ఆ పాము అత్యంత విషపూరితమైనది కావడంతో.. పాము కాటుకు వేసిన నిమిషాల వ్యవధిలోనే తివారి మృతి చెందాడు.

https://telugu.asianetnews.com/national/maharashtra-four-sadhus-were-attacked-on-suspicion-of-abducting-children--ri6ocq

వినోద్ తివారీ ఆ ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా.. సమాచారం అందించగానే వచ్చి.. పట్టుకుని,సమీపంలోని అడవిలో వదిలేసేవాడు. అలా స్తానికులతో బాగా దగ్గరయ్యాడు. అతడిని వారు 'స్నేక్ మ్యాన్'గా పిలిచేవారు. అలా స్థానికంగా ప్రసిద్ధి చెందాడు. ఆదివారం ఆయన అంత్యక్రియలకు పలువురు హాజరయ్యారు.

click me!