జడ్జిగారిని కాటేసిన పాము.. వాదనలు వింటుండగానే ఘటన

First Published 5, Sep 2018, 8:53 AM IST
Highlights

ప్రస్తుతం దేశం మొత్తం పాము కాటులతో వణికిపోతోంది. ఎక్కడ చూసిన పాముకాటుకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. తాజాగా ఏకంగా కోర్టు హాల్‌లోనే జడ్జిని కాటేసింది ఓ పాము. 

ప్రస్తుతం దేశం మొత్తం పాము కాటులతో వణికిపోతోంది. ఎక్కడ చూసిన పాముకాటుకు సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. తాజాగా ఏకంగా కోర్టు హాల్‌లోనే జడ్జిని కాటేసింది ఓ పాము. నవీ ముంబైలోని ఓల్డ్ పాన్వేల్‌లోని బందర్ రోడ్డులోని పాత కోర్టు ఛాంబర్‌లో జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సీపీ కషీద్ వాదనలు వింటున్నారు.

కక్షిదారులు, వాద ప్రతివాదులు, న్యాయవాదులతో కోర్టు హాల్ కిక్కిరిసి ఉంది.. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ పాము న్యాయమూర్తి కుడిచేతిపై కరిచింది. దీంతో వెంటనే స్పందించిన సిబ్బంది ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

విషపూరితం కానీ పాము కరవడంతో మెజిస్ట్రేట్‌కు ప్రాణాపాయం తప్పింది. ప్రథమ చికిత్స అనంతరం జస్టిస్ కషీద్‌ను డిశ్చార్జి చేశారు. అయితే కోర్టు పాతభవనంలో ఉండటంతో పాటు పిచ్చి చెట్లు మొలవడంతో పాములు వస్తున్నాయని కోర్టు సిబ్బంది అంటున్నారు.

Last Updated 9, Sep 2018, 1:21 PM IST