Union Minister Smriti Irani: "లేడీ మెంబ‌ర్".. కేంద్ర మంత్రి ఇరానీ వ్యాఖ్య‌పై లోక్‌స‌భ‌లో ర‌చ్చ‌!

Published : Apr 02, 2022, 12:57 AM ISTUpdated : Apr 02, 2022, 12:58 AM IST
Union Minister Smriti Irani: "లేడీ మెంబ‌ర్".. కేంద్ర మంత్రి ఇరానీ వ్యాఖ్య‌పై లోక్‌స‌భ‌లో ర‌చ్చ‌!

సారాంశం

Union Minister Smriti Irani: లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన గీతా విశ్వనాథ్ వంగాను లేడీ మెంబ‌ర్ అని కేంద్రం మంత్రి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సౌగత రే అభ్యంతరం వ్యక్తం చేశారు,  మ‌హిళ మంత్రుల‌ను "గౌరవనీయ సభ్యురాలు" అని సంబోధించాల్సి ఉందని సూచించారు.  

Union Minister Smriti Irani: బీజేపీ నాయ‌కురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్ర‌వారం చేసిన వ్యాఖ్య వివాదాస్ప‌ద‌మైంది. పార్ల‌మెంట్ లో ఒక మ‌హిళా స‌భ్యురాలిని ఉద్దేశించి లేడీ అని సంబోధించ‌డంపై కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రి, తృణ‌మూల్ కాంగ్రెస్ స‌భ్యులు సౌగ‌తా రాయ్ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 

వివ‌రాల్లోకెళ్తే.. శుక్ర‌వారం లోక్‌స‌భ ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స‌భ్యురాలు వంగ విశ్వ‌నాథ్ గీతను ఉద్దేశించి మంత్రి స్మృతి ఇరానీ.. లేడీ మెంబ‌ర్ అని సంబోధించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను అధిర్ రంజ‌న్ చౌద‌రి, సౌగ‌తారాయ్ త‌ప్పుబ‌ట్టారు.తీవ్రం అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. త‌న స‌హ‌చ‌ర స‌భ్యురాలిని గౌర‌వ‌నీయ స‌భ్యురాలు లేదా ఎంపీ అని సంబోధించాల‌ని అధిర్ రంజ‌న్ చౌద‌రి, సౌగ‌తారాయ్ సూచించారు. 

దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..  తానేం మాట్లాడినా అన్‌పార్ల‌మెంట‌రీ భాష వినియోగించ‌లేద‌న్నారు. మ‌హిళా స‌భ్యురాలిని ఉద్దేశించి లేడీ అని పిలవడం తప్పుకాదన్నారు. స‌భలోనే ఉన్న స‌భ్యురాలిని తానేమీ.. కించప‌ర్చ‌లేద‌ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. కేంద్ర మంత్రికి మ‌ద్ద‌తుగా బిజూ జ‌న‌తాద‌ళ్ (బీజేడీ) స‌భ్యులు అనుభ‌వ్ మొహంతి నిలిచారు. స్మృతి ఇరానీ ఎటువంటి అన్‌పార్ల‌మెంట‌రీ భాష గానీ, అవ‌మాన‌క‌ర‌మైన‌, త‌ప్పు ప‌దం వాడ‌లేద‌ని,అగౌరవంగా మాట్లాడలేదని అన్నారు.. అయితే హాస్యాస్పదమేమిటంటే ఇద్దరు పురుషులు లేచి నిలబడి నేను ఒక మహిళా సభ్యుడిని ఎలా సంబోధించాలో చెప్పాలని ఆయన అన్నారు. 

అంతకుముందు శుక్రవారం రాజ్యసభలో సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, ఎంబీబీఎస్‌కు సీట్లు పెంచాలని, పేద పిల్లలకు ఉచితంగా ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేస్తూ.. వాటికి సరైన పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్‌లో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ.. దేశంలో 140 బిలియన్ డాలర్ల టెక్స్‌టైల్ పరిశ్రమ 100 మిలియన్లకు పైగా ప్రజలకు ఉపాధి కల్పిస్తోందని, జిడిపికి రెండు శాతానికి పైగా సహకారం అందిస్తుందని బిజెపికి చెందిన సురేష్ సేథ్ అన్నారు. ఎగుమతుల రంగంలో ఈ పరిశ్రమ వాటా పది శాతానికిపైగా ఉందన్నారు. ప్రపంచంలోనే పత్తి, జనపనార ఉత్పత్తిలో భారతదేశం అగ్ర‌గ్రామి అని, అయినప్పటికీ వస్త్ర పరిశ్రమలో బంగ్లాదేశ్ భారతదేశం కంటే ముందుందని సేథ్ చెప్పారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !
Success Story: సెక్యూరిటీ గార్డు కొడుకు.. 3 కంపెనీలకు బాస్ ! ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే !