'కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి' : స్మృతి ఇరానీ

Published : May 05, 2023, 07:05 PM IST
'కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి' : స్మృతి ఇరానీ

సారాంశం

కర్ణాటక ఎన్నికలు: కాంగ్రెస్ హిందూ వ్యతిరేకనీ, వారి మేనిఫెస్టోలో స్పష్టంగా ఉందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హిందూ సంస్థను ఉగ్రవాద సంస్థతో పోలుస్తోందనీ, వారు ఏ మతపరమైన, సామాజిక-రాజకీయ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని మండిపడ్డారు.

కర్ణాటక ఎన్నికలు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఈ తరుణంలో 
బజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐలపై నిషేధం విధిస్తున్నట్లు కాంగ్రెస్‌ చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. తీవ్రవాద ఆరోపణలను ఎదుర్కొంటున్న PFIని దేశంలోని అనేక రాష్ట్రాలు  నిషేధించాయి. అయితే.. బజరంగ్‌దళ్‌నిషేధం విధిస్తామనే హామీని విమర్శాస్త్రంగా మార్చుకున్న బీజేపీ .. కాంగ్రెస్ పై విరుచుకపడుతోంది. తాజాగా ఈ హామీనే కేంద్రంగా కర్ణాటక కాంగ్రెస్‌పై కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేతలు హిందూ దేవతలను అవమానించారని ఆరోపించింది.  

'ప్రత్యర్థులెవరినైనా బీజేపీ దెబ్బకొడుతుంది'

స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. 'తాను జ్యోతిష్యురాలిని కాదు, కానీ కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తాను హామీ ఇస్తున్నానని అన్నారు. లేదంటే.. హిందూ దేవతలను అవమానించిన కాంగ్రెస్ నేతలు తలవంచరని అన్నారు. బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ బెదిరింపులను ఎత్తి చూపిన స్మృతి ఇరానీ..బిజెపి ఏ ప్రత్యర్థిపైనా గెలిచి తీరుతుందని, గెలుపు కోసం వేచి చూడాలని స్పష్టం చేశారు.

'కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి'

మంగళవారం (మే 2) విడుదల చేసిన మేనిఫెస్టోలో తమకు అధికారం దక్కే అవకాశం వస్తే భజరంగ్ దళ్, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తామని కాంగ్రెస్‌ స్పష్టం చేయడం గమనార్హం. ఇందులో బజరంగ్‌దళ్‌పై నిషేధానికి సంబంధించి కాంగ్రెస్‌ను 'హిందూ వ్యతిరేక' పార్టీగా అభివర్ణించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి. వారి మేనిఫెస్టోలో స్పష్టంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ హిందూ సంస్థను ఉగ్రవాద సంస్థతో పోలుస్తోందనీ, వారు ఏ మతపరమైన, సామాజిక-రాజకీయ విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతోందని మండిపడ్డారు.  

స్మృతి ఇరానీ ఇంకా మాట్లాడుతూ.. ఎవరో జై బజరంగ్ బలి నినాదం చేసినందుకే కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు వెళ్తుందా? కాంగ్రెస్ హిందూ దేవుడి ముందు వంగి క్షమించమని వేడుకుంటుందా?అని ప్రశ్నించారు. అదే సమయంలో బజరంగ్ దళ్‌ను నిషేధించాలనే కాంగ్రెస్ భావించడం సరికాదనీ, 'జై బజరంగ్ బలి' అని నినాదాలు చేసిన వారిపై ఫిర్యాదు చేయడం గందరగోళ వాతావరణాన్ని స్రుష్టిస్తుందని అన్నారు.

కర్ణాటకలో బీజేపీ తధ్యం  

బజరంగ్ దళ్‌ను బజరంగ్ బలితో లేదా హనుమంతుడితో అనుబంధించడం బిజెపికి ఆమోదయోగ్యమైనదని భావిస్తున్నారా? అని ప్రశ్నించగా.. స్మృతి ఇరానీ స్పందిస్తూ..కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు బిజెపిపై దాడి చేసే వరకు వేచి ఉండలేనని, ముందస్తు ప్రణాళిక ప్రకారం రక్షించడం రాజ్యాంగ హక్కు అని అన్నారు. కర్ణాటకలో బీజేపీ సులువుగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్