సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు.. ఒడిశాలో ఘటన

Published : Jun 06, 2023, 04:22 PM IST
సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు.. ఒడిశాలో ఘటన

సారాంశం

సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌‌లోని ఓ బోగీలోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి పొగలు వెలువడటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు.

ఒడిశాలోని బాలాసోర్‌‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో 278 మంది ప్రాణాలు  కోల్పోవడం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. తాజాగా సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్‌‌లోని ఓ బోగీలోని ఎయిర్ కండిషనింగ్ యూనిట్ నుండి పొగలు వెలువడటంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించి రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో అధికారులు సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్‌ప్రెస్ మంగళవారం మధ్యాహ్నం ఒడిశాలోని బ్రహ్మపూర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. వెంటనే పొగలను అదుపు చేశారు. 

అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ ఇలాంటి ఘటన చోటుచేసుకుంటుందనే భయంతో కొందరు ప్రయాణికులు బోగీ ఎక్కేందుకు నిరాకరించారు. పొగలు వెలువడిన బోగీని మార్చాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో 45 నిమిషాల తర్వాత రైలు తిరిగి గమ్యస్థానానికి బయలుదేరింది. 

Also Read: Odisha Train Accident: అయ్యో పాపం.. ఇప్పటికీ గుర్తించని 101 మంది మృతదేహాలు

‘‘బ్రహ్మపూర్ స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్-అగర్తల ఎక్స్‌ప్రెస్ కోచ్ నెంబర్ B-5లో చిన్న ఎలక్ట్రికల్ ఇష్యూ తలెత్తింది. డ్యూటీలో ఉన్న సిబ్బంది వెంటనే సమస్యను పరిష్కరించారు’’ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

ఒక్క మాటతో సగానికి తగ్గిన హాస్పిటల్ బిల్లు.. అసలు ట్రిక్ ఇదే
ఏమిటీ.. తీర్థయాత్రకు వెళితే లక్ష రూపాయలు ఇస్తారా..!