స్మార్ట్ ఫోన్ కు బానిస..ఆపై పిచ్చాస్పత్రిలో చికిత్స

By Nagaraju TFirst Published Oct 9, 2018, 4:50 PM IST
Highlights

మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో అనేక ఫోన్లు వస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని ఒక్కసెల్ ఫోన్ లో చూసేంతగా టెక్నాలజీ వచ్చేసింది. అంతటి సమాచారాన్ని ఇచ్చే సెల్ ఫోన్ ఒక యువకుడిని పిచ్చాస్పత్రి పాల్జేసింది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన స్మార్ట్ ఫోన్ కు బానిసయ్యాడు. 

బెంగళూరు: మార్కెట్ లోకి సరికొత్త ఫీచర్స్ తో అనేక ఫోన్లు వస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని ఒక్కసెల్ ఫోన్ లో చూసేంతగా టెక్నాలజీ వచ్చేసింది. అంతటి సమాచారాన్ని ఇచ్చే సెల్ ఫోన్ ఒక యువకుడిని పిచ్చాస్పత్రి పాల్జేసింది. బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన స్మార్ట్ ఫోన్ కు బానిసయ్యాడు. ఉద్యోగం లేకపోవడంతో ఇక స్మార్ట్ ఫోన్ పట్టుకుని కాలం వెల్లదీస్తున్నాడు. 

26 ఏళ్లు వచ్చినా ఎలాంటి ఉద్యోగం చెయ్యడం లేదు సరికదా..ఉద్యోగ ప్రయత్నమే చెయ్యడం లేదు దీంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం కోసం ప్రయత్నించాలని హితవు పలికారు. 

దీంతో ఆ యువకుడు తనగదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తన స్మార్ట్ ఫోన్ లో నెట్ ఫ్లిక్స్ లోని వీడియోలను చూస్తూ ఉండిపోయాడు. దాదాపు ఏడు గంటలపాటు అలాగే వీడియోలు చూస్తు ఉండిపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యాడు. 

వింత చేష్టలతో పిచ్చెక్కిన వ్యక్తిలా ప్రవర్తించాడు. డీ ఎడిక్షన్ సమస్యతో బాధపడుతున్నాడని గ్రహించిన తల్లిదండ్రులు ఆ యువకుడిని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్‌లో చేర్పించారు.
 
ప్రస్తుతం ఆ యువకుడికి చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఉద్యోగం రాకపోవడంతో మానసికంగా కుంగిపోయాడని...అనంతరం ఆన్‌లైన్‌ వ్యసనంతో అతడు ఆసుపత్రిలో చేరాల్సిన అగత్యం ఏర్పడిందని స్పష్టం చేశారు. 

click me!