భిలాయ్ స్టీల్ ప్యాక్టరీలో భారీ పేలుళ్లు...తొమ్మిదిమంది మృతి

Published : Oct 09, 2018, 02:47 PM ISTUpdated : Oct 09, 2018, 02:57 PM IST
భిలాయ్ స్టీల్ ప్యాక్టరీలో భారీ పేలుళ్లు...తొమ్మిదిమంది మృతి

సారాంశం

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  రాజధాని రాయ్ పూర్ కు సమీపంలోని భిలాయ్ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదవశాత్తు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదం భారినపడిన తొమ్మిదిమంది ఆక్కడికకక్కడే మృతిచెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఛత్తీస్‌ఘఢ్‌లోని దుర్గ్ జిల్లాలో భిలాయ్ పట్టణంలో స్టీల్ అథారిటీ ఆప్ ఇండియా ఆద్వర్యంలో నడిచే ఓ స్టీల్‌ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ లోని కోక్ ఓవేన్ సెక్షన్ లో గ్యాస్ పైప్‌లైన్ లీకవడంతో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుడు దాటికి ఆరుగురు దుర్మరణం పాలవగా మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కూడా చాలామందివ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ పేలుళ్ల పై సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది హుటాహుటిన స్టీల్ ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. కార్మికుల సాయంతో గాయపడిన వారిని కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే