హోం వర్క్ తప్పించుకోవడానికి ఫేక్ కిడ్నాప్ కథ అల్లిన ఆరో తరగతి బాలుడు

By Mahesh KFirst Published Dec 9, 2022, 9:51 PM IST
Highlights

హోం వర్క్ తప్పించుకోవడానికి ఆరో తరగతి బాలుడు కిడ్నాప్ కథ అల్లాడు. హోం వర్క్ తప్పించుకుని ఓ ట్రైన్ ఎక్కాడు. అక్కడ తెలిసినవారు బాలుడిని చూడటంతో భయంతో ఓ కిడ్నాప్ కథ చెప్పాడు. చివరకు నిజం ఒప్పుకున్నాడు.
 

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఆరో తరగతి బాలుడు ఓ ఫేక్ కిడ్నాప్ కథ అల్లాడు. హోం వర్క్ తప్పించుకోవడానికి ఈ స్టరీ అల్లినట్టు విద్యార్థి చివరికి అంగీకరించాడు. ఛింద్వారా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

జున్నర్‌దేవ్ మున్సిపాలిటీకి చెందిన 12 ఏళ్ల ఆరో తరగతి బాలుడు హోం వర్క్ తప్పించుకోవడానికి ఓ ఫేక్ కిడ్నాప్ కథే అల్లేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగానే అసలు విషయం బయటపడింది. జున్నర్‌దేవ్ నుంచి ఛింద్వారాకు వెళ్లుతున్న ట్రైన్‌లో ఆ బాలుడు వారి ఇంటి పొరుగువారికి కనిపించాడు. వారు ఆ బాలుడి పేరెంట్స్‌కు ఫోన్ చేసి చెప్పాడు. సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Also Read: ఇన్సూరెన్స్ కట్టి భార్యను చంపేసిన భర్త.. రూ. 1.90 కోట్ల కోసం ప్రణాళిక వేసి యాక్సిడెంట్

ఆ విద్యార్థిని గవర్నమెంట్ రైల్వే పోలీసులు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. ఇలా చెప్పాడు.. సోమవారం ఉదయం బాత్‌రూమ్‌కు వెళ్లాడని చెప్పాడు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి తనను కిడ్నాప్ చేశారని వివరించాడు. అప్పుడు వారిని రైల్వే స్టేషన్‌కు తీసుకె ళ్లారని, బేతుల్‌కు తీసుకెళ్లాలని వాళ్లు మాట్లాడుకున్నట్టు చెప్పాడు. అయితే, రైల్వే స్టేషన్ చేరగానే వారి నుంచి తప్పించుకున్నట్టు, వెంటనే మరో ట్రైన్‌ ఎక్కి గుంపులో కలిసిపోయినట్టు వివరించాడు.

పోలీసులు క్రాస్ చెకింగ్ చేయగానే ఆ బాలుడు దొరికిపోయాడు. చివర కు హోం వర్క్ తప్పించు కోవడానికి తాను ఈ కిడ్నాప్ కథ అల్లినట్టు వివరించాడు.

click me!