యూట్యూబ్ యాడ్స్ వల్ల ఎగ్జామ్ ఫెయిల్ అయ్యా.. రూ. 75 లక్షల పరిహారం ఇవ్వండి: సుప్రీంకోర్టుకు నిరుద్యోగి

By Mahesh KFirst Published Dec 9, 2022, 7:05 PM IST
Highlights

యూట్యూబ్ యాడ్స్ వల్ల ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యా అని ఓ నిరుద్యోగి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆ కంపెనీ నుంచి తనకు రూ. 75 లక్షల జరిమానా కట్టించాలని కోరాడు. దీనికి సుప్రీంకోర్టు ఆ పిటిషర్‌కే ఫైన్ వేసి పిటిషన్ డిస్మిస్ చేసింది.
 

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ నిరుద్యోగి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అతను యూట్యూబ్ వీడియోలు కూడా చూస్తాడు. ఆ వీడియోల్లో వచ్చే యాడ్స్ తనను డైవర్ట్ చేశాయని, అందుల్లే పరీక్ష ఫెయిల్ అయ్యానని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. యాడ్స్‌తో తనను డైవర్ట్ చేసినందుకు గూగుల్ ఇండియా కంపెనీ తనకు రూ. 75 లక్షల పరిహారం ఇవ్వాలని పిటిషన్ వేశాడు.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. డిస్మిస్ చేసి పిటిషనర్ పై రూ. 1 లక్ష జరిమానా విధించింది. తాను నిరుద్యోగిని అని, తనను క్షమించాలని వేడుకోవడంతో ఈ జరిమానాను రూ. 25 వేలకు తగ్గించింది. యూట్యూబ్ మాతృసంస్థ గూగుల్ అన్న విషయం తెలిసిందే.

‘ఇంటర్నెట్‌లోని యాడ్స్ చూసిన మీకు నష్టపరిహారం కావాలి. ఈ యాడ్స్ వల్ల మీ అటెన్షన్ డైవర్ట్ అయింది. కాబట్టి, ఎగ్జామ్ క్లియర్ చేయలేదు. అంతేనా?’ అని న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, ఏఎస్ ఒకాలు పిటిషనర్‌ను అడిగారు. ‘ఇది ఆర్టికల్ 32 కింద ఫైల్ అయిన చెత్త పిటిషన్. ఇలాంటి పిటిషన్‌లు న్యాయస్థానం సమయాన్ని వృథా చేస్తాయి’ అని అన్నారు.

Also Read: ‘భక్తి ఎక్కువైనా ప్రమాదకరమే’.. గుడిలోని ఏనుగు విగ్రహం కింద ఇరుక్కుపోయిన భక్తుడు.. వైరల్ వీడియో ఇదే

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో న్యూడిటీని బ్యాన్ చేయాలని కూడా పిటిషనర్ డిమాండ్ చేశాడు. ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతున్న పిటిషనర్ యూట్యూబ్‌లో సెక్సువల్ కంటెంట్ ఉన్న యాడ్స్ చూశాడని పిటిషన్ భావిస్తున్నాడు అని ధర్మాసనం పేర్కొంది. ‘మీకు ఇష్టం లేకుంటే.. వాటిని చూడకండి’ అని తెలిపింది.

click me!