జార్ఖండ్ లో విషాదం: ధన్ బాద్ వద్ద విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి

Published : May 29, 2023, 07:09 PM IST
జార్ఖండ్ లో  విషాదం: ధన్ బాద్  వద్ద విద్యుత్ షాక్ తో  ఆరుగురు మృతి

సారాంశం

జార్ఖండ్ లో  విషాదం: ధన్ బాద్  వద్ద విద్యుత్ షాక్ తో  ఆరుగురు మృతి

రాంచీ: జార్ఖండ్  రాష్ట్రంలో  విద్యుత్ షాక్ తో  సోమవారంనాడు  ఆరుగురు మృతి చెందారు. తూర్పు మధ్య రైల్వేలోని  ధన్ బాద్ డివిజన్   పరిధిలో గల  నిచిత్ పూర్ రైల్వే క్రాసింగ్  వద్ద  విద్యుత్ షాక్ తో  ఆరుగురు   మృతి చెందారు. రైల్వే  క్రాసింగ్ వద్ద  విద్యుత్  స్థంభాన్ని  ఏర్పాటు  చేసే సమయంలో  విద్యుత్  షాక్ కు గురి కావడంతో  ఆరుగురు మృతి చెందారు. 
 
 డిఆర్ఎం  కమల్ కిషోర్  సిన్హా సంఘటన స్థలానికి చేరుకుని  పరిస్థితిని  సమీక్షించారు.  ఆరుగురు మృతి చెందారని ఆయన  నిర్ధారించారు.  ఈ ఘటనపై   హైలెవల్  విచారణ  నిర్వహిస్తామని  ఆయన  ప్రకటించారు.  ఈ ప్రమాదానికి   బాధ్యులపై  చర్యలు తీసుకుంటామని  డీఆర్ఎం  ప్రకటించారు. 

ఎనిమిది మంది  వ్యక్తులు  సేఫ్టీ గేర్  లేకుండా  లేదా  ఎన్నికల  కనెక్షన్ ను  స్విచ్ ఆఫ్ చేయకుండా  పనిచేయడంతో  ఈ ప్రమాదం  జరిగిందనే అభిప్రాయాలు  కూడ  లేకపోలేదు.  ఈ  ప్రమాదం కారణంగా  ధన్ బాద్ , గోమో జంక్షన్ లో  రైళ్ల రాకపోకలను  నిలిపివేశారు. గంటన్నర తర్వాత  రైళ్ల  రాకపోకలను  పునరుద్దరించారు

PREV
click me!

Recommended Stories

అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial
Fact: ఆ గ్రామంలో ఏ ఇంటికి తాళం వేయరు, అసలు తలుపులే ఉండవు.. ఏంటా గ్రామం, దాని కథేంటి.?