ఆ ఆవేదన కుటుంబ సభ్యులకు చెప్పుకోలేకపోయిన యువతి.. ఇంట్లోనే ఆత్మహత్య.. ఏం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published May 29, 2023, 5:11 PM IST
Highlights

ఓ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి పూర్తిచేసింది. ఉద్యోగంపై చేస్తూ జీవితం సాగించాలని కోరుకుంది. భవిష్యత్తు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఇంతలోనే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందింది.

బెంగళూరు: ఓ యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి పూర్తిచేసింది. ఉద్యోగంపై చేస్తూ జీవితం సాగించాలని కోరుకుంది. భవిష్యత్తు ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఇంతలోనే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణం చెందింది. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆమెకు జాబ్ రాకపోవడమేనని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుందని చెబుతున్నారు. వివరాలు.. ఉడిపి జిల్లా బైందూరు కల్‌తోడు గ్రామానికి చెందిన గౌతమి ఎంకామ్ పూర్తి చేసింది. చదువు పూర్తయ్యాక చాలా కంపెనీల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె బ్యాకింగ్ పరీక్ష రాసింది. కానీ ఉద్యోగం రాలేదు. 

దీంతో గౌతమి తీవ్ర మనోవేదనకు గురైంది. గౌతమి కుటుంబ సభ్యులతో తన ఆవేదనను చెప్పుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన గౌతమి డెత్ నోట్ రాసి ఇంటి మొదటి అంతస్తులో ఈ నెల 27న ఆత్మహత్య చేసుకుంది. ఇది ఆలస్యంగా ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు నిర్దారించారు. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. యువతి గౌతమి రాసిన డెత్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి బైందూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్టుగా పోలీసులు చెప్పారు. 

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

click me!