తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం..

Published : Mar 19, 2023, 10:58 AM IST
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం..

సారాంశం

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టిన  ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు.

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టిన  ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో తొమ్మిది ఏళ్ల చిన్నారి, నలుగురు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం తొమ్మది మంది ప్రయాణిస్తున్నారని.. వారిలో ఆరుగురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. మృతులను నామక్కల్ జిల్లాకు చెందిన కె ముత్తుసామి,  ఆర్‌ తిరుమూర్తి, సేలం జిల్లాకు చెందిన పి అనంతయి,  జీ ధావనశ్రీ, సంతోష్ కుమార్‌తో పాటు మురుగేశన్‌‌లుగా గుర్తించారు. 

వివరాలు.. సేలం జిల్లా నుండి కుంభకోణంలోని ఆలయానికి తొమ్మిది మంది వ్యక్తులు కారులో వెళుతుండగా తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. డ్రైవర్ సంతోష్ కుమార్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో.. లారీని వారి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ సంతోష్‌తో సహా ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడినవారిని తిరుచ్చిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తిరుచ్చి పోలీస్ సూపరింటెండెంట్ సుజిత్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

ఈ ఘటన తర్వాత ఆ మార్గంలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి.. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?