మానవ హక్కులకు భంగం వాటిల్లకూడదు - కేరళ హైకోర్టు.. కూతురు పెళ్లికి హాజరయ్యేందుకు కరడుగట్టిన నేరస్తుడికి అనుమతి

By Asianet NewsFirst Published Mar 19, 2023, 10:20 AM IST
Highlights

దోషి అని తేలినప్పటికీ అతడికి ఉన్న మానవ హక్కులను హరించలేమని కేరళ కోర్టు అభిప్రాయపడింది. కూతురు పెళ్లికి హాజరయ్యేందుకు ఓ కరడుగట్టిన నేరస్తుడికి అనుమతి ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య అతడిని జైలు నుంచి బయటకు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. 

మానవ హక్కులకు భంగం వాటిల్లకూడదని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. నేరానికి పడిన శిక్ష ఓ వ్యక్తిని మానవేతరుడిగా పరిగణించదని తెలిపింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న కరుడుగట్టిన నేరస్తుడు జయానందన్ కు పెరోల్ మంజూరు చేస్తూ ఈ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆయన వచ్చే వారం తన కుమార్తె వివాహానికి హాజరుకానున్నాడు. 

మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలెట్లు మృతి..

సెంట్రల్ కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని హై సెక్యూరిటీ జైలులో ఉన్న భయంకరమైన హంతకుడు జయానందన్ కోసం అతడి భార్య దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. జయనాధన్ వియ్యూరులోని కేంద్ర కారాగారంలో మూడు జీవిత ఖైదులు అనుభవిస్తున్నాడు.  త్రిస్సూర్ లోని వడక్కుమ్నాథన్ ఆలయంలో బుధవారం జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయనను భారీ పోలీసు బందోబస్తు మధ్య అతడు పెళ్లికి వెళ్లనున్నాడు.

పెళ్లిలో పాల్గొనేందుకు తన భర్తకు ఉపశమనం కల్పించేందుకు అధికారులు విముఖత చూపడాన్ని జయానందన్ భార్య కోర్టులో పిటిషన్ లో సవాలు చేశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది అయిన కుమార్తె వాదనలు వినిపించారు. దీంతో కూతురు వివాహం కాబట్టి ఆ వేడుకకు వధువు తండ్రి హాజరు కావడం అత్యంత సముచితమని, పిటిషనర్ తన కూతురు వివాహంలో భర్త ఉండాలని కోరుకుంటోందని కాబట్టి పెరోల్ ఇవ్వాలని ఈ కోర్టు అభిప్రాయపడిందని జస్టిస్ బెచు కురియన్ థామస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వివాహ వేడుకల నిమిత్తం 2023 మార్చి 21వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జయనాధన్ తన ఇంటికి వెళ్లి.. తిరిగి అదే రోజు జైలుకు రావాలని కోర్టు అదేశించింది. అలాగే మరుసటి రోజు ఉదయం కూడా  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే వివాహానికి హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చారు.  నేరానికి శిక్ష పడినంత మాత్రాన మనిషిని మానవేతరుడిగా మార్చలేమని కోర్టు అభిప్రాయపడింది.

హిందూ కూతుళ్లను కించపరిచే వారి చేతులు నరికేస్తాం - కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పొందుపరిచిన గొప్ప స్వేచ్ఛ హక్కును విస్మరించలేమని హైకోర్టు పేర్కొంది. సాధారణంగా కుమార్తె పెళ్లిలో పాల్గొనే అవకాశాన్ని ఆ స్వేచ్ఛలో భాగంగానే పరిగణించాలని తెలిపింది. అయితే జైలులో దోషి ప్రవర్తన అంతంతమాత్రంగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అతడు రెండు సార్లు జైలు నుంచి తప్పించుకున్నాడని, ఆ నేరాలకు కూడా దోషిగా తేలడంతో అవకాశం దొరికినప్పుడల్లా తప్పించుకునేందుకు ప్రయత్నించే వ్యక్తిగా ఆయనను పరిగణిస్తున్నామని కోర్టు పేర్కొంది.

‘‘దోషిని జైలు నుండి తీసుకెళ్లే సమయంలో తీవ్రమైన భద్రతా సవాళ్లు ఉన్నాయని హెచ్చరికలు ఉన్నందున, ప్రతివాదులు 1 (ప్రభుత్వం), 3 (త్రిస్సూర్ సిటీ పోలీసులు) ఎస్కార్ట్ తో పాటు బలమైన,  తగినంత పోలీసు నిఘా ఉండేలా చూసుకోవాలి. దోషి తప్పించుకోకుండా జాగ్రత్తపడాలి’’ అని కోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది సాదాసీదా దుస్తుల్లో ఉండాలని, అత్యవసరమైతే తప్ప పెళ్లికి సంబంధించిన కార్యక్రమాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది.

జీవితంలో ఏమైనా చేయండి.. మీ మాతృభాషను ఎప్పటికీ వదులుకోవద్దు : అమిత్ షా

కాగా.. జయానందన్ హత్యకు పాల్పడ్డాడు. అతడిపై రెండు హత్య కేసులు ఉన్నాయి. 15 దొంగతనాల కేసుల్లో ఎనిమిదింటిలో దోషిగా ఉన్నాడు. ఇది కాకుండా అతడు మూడుసార్లు జైలు నుండి తప్పించుకున్నాడు. ప్రస్తుతం వివిధ కేసుల్లో కలిపి జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.
 

click me!