కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు...ఆరుగురు సజీవ దహనం

First Published 12, Sep 2018, 2:51 PM IST
Highlights

 ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీహాట్ మార్గ్‌లోని మోహిత్ పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంక్ పేలడంతో ఆరుగురు కార్మికులు సజీవదహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తరప్రదేశ్ : ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నూర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. డీహాట్ మార్గ్‌లోని మోహిత్ పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలో గ్యాస్ ట్యాంక్ పేలడంతో ఆరుగురు కార్మికులు సజీవదహనమవ్వగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని బిజ్నూర్ ఎస్పీ ఉమేశ్ సింగ్ స్పష్టం చేశారు.

విధులు నిర్వహిస్తున్న మరికొంత మంది కార్మికుల జాడ తెలియడం లేదని దానిపై విచారణ చేస్తున్నట్ల తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఆరుమృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. కనిపించకుండా పోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే  కొద్ది రోజులుగా గ్యాస్ ట్యాంక్ లీక్ అవుతున్న యాజమాన్యం పట్టించుకోవడం లేదని ప్రాథమిక విచారణలో తేలినట్లు ఎస్పీ ఉమేశ్ సింగ్ తెలిపారు. 

మరమ్మతు కోసం వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా  గ్యాస్ ట్యాంక్ లో పేలుడు సంభవించిందన్నారు. మృతులంతా 20 నుంచి 40 ఏళ్ల వయసులోపు వాళ్లేనన్నారు. ట్యాంకర్ లీక్ అవుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను, నిబంధనలను ఉల్లంఘించినందుకు కంపెనీ యాజమాన్యంపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఉమేశ్ సింగ్ స్పష్టం చేశారు. 

Last Updated 19, Sep 2018, 9:24 AM IST