ఫ్రమ్ ది ఇండియా గేట్: కర్ణాటకలో వ్యుహాకర్తల జోష్.. తమిళనాట రోస్టెడ్ పన్నీర్..

Published : Mar 12, 2023, 10:29 AM IST
ఫ్రమ్ ది ఇండియా గేట్: కర్ణాటకలో వ్యుహాకర్తల జోష్.. తమిళనాట రోస్టెడ్ పన్నీర్..

సారాంశం

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ‘‘ఫ్రమ్ ది ఇండియా గేట్’’ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. మరి తాజా ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

దేశవ్యాప్తంగా రాజకీయాలలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాలను, బ్యూరోక్రసీలోని ఆసక్తికర విషయాలను ఫ్రమ్ ది ఇండియా గేట్ పేరుతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ మీ ముందుకు తీసుకోస్తోంది. తెరవెనక సంగతులు, అభిప్రాయాలు, కుట్రలు, రాజకీయ క్రీడ, అంతర్గత విబేధాలు, రాజకీయ పక్షాల వ్యూహాలను రీడర్స్‌కు అందజేస్తోంది. మరి 17వ ఎపిసోడ్‌లో విశేషాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ట్రాష్ టూ క్యాష్.. 
కేరళ ఎర్నాకుళం జిల్లాలోని బ్రహ్మపురం డంప్ సైట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. బ్రహ్మపురం యార్డు నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో రాజకీయ అవినీతి దుర్గంధం వెదజల్లుతోంది. కేరళ వాణిజ్య కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతంలో.. గత 11 రోజులుగా ప్లాస్టిక్ వ్యర్థాల పర్వతం కాలిపోతోంది. అయితే ఈ ప్రమాద కారణాలు తెలుసుకోవడాని పోస్టు మార్టమ్ గేమ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ.. బ్రహ్మపురంలో ప్లాంట్‌ను నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థకు, దాని సబ్‌కాంట్రాక్ట్‌గా తీసుకున్న సంస్థకు లెఫ్ట్ పార్టీ నుంచి విస్తారమైన ఆశీర్వాదం ఉంది.

ప్రతి రోజు పాలక సీపీఎంతో ఆ సంస్థ ఆరోపించిన బంధాన్ని బహిర్గతం చేస్తోంది. వాస్తవానికి డైరెక్టర్లలో ఒకరు సీపీఎం అగ్ర నాయకుడికి సన్నిహిత బంధువు. సబ్ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న సంస్థకు ఎర్నాకులం జిల్లాలోని ఒక నాయకుడితో సంబంధాలు ఉన్నాయి. ఈ సమస్య అక్షరాలా సంక్లిష్టమైన సమస్యాత్మకమైన పరిస్థితిగా మారుతోంది. 

పొరుగువారి అసూయ.. యజమాని గర్వం..
ఎన్నిక ఏదైనా విజయం కోసం కొన్ని పార్టీలు ఎన్నికల వ్యుహాకర్తలపై ఆధారపడుతున్నాయి. అయితే ఈ రాజకీయ వ్యూహకర్తలు పొడవాటి కోట్లు, షెర్లాక్ హోమ్స్ టోపీలు ధరించి నడవరు. అలాగే జేమ్స్ బాండ్ గాడ్జెట్‌లను కూడా కలిగి ఉండరు. అందులో కాంగ్రెస్ ఎన్నికల వ్యుహాకర్త సునీల్‌ కనుగోలు లాంటి వారు భారీ ఇమేజ్‌ను పొందుతున్నారు. సునీల్ కనుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేశాడు. ప్రస్తుతం సునీల్.. కాంగ్రెస్‌కు సేవలు అందిస్తున్నారు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని వ్యూహరచన చేస్తున్న సునీల్‌కు 200 మంది సైన్యం ఉంది. సునీల్ జట్టు వాస్తవానికి కొంత ప్రారంభ ఫలితాలను పొందుతుంది. ఈ జట్టు చేపడుతున్న కొన్ని సృజనాత్మక ప్రచారాలు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా ప్రశంసలు పొందాయి. అయితే సునీల్ లాంటి పోస్టర్ బాయ్‌పై బీజేపీ ఆధారపడటం లేదు. అయితే ఆ పార్టీ వారాహి సంస్థ మాత్రం వందలాది మంది యువకులు నిశ్శబ్ద సేవ చేస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతోంది. వారు డేటా ఆధారిత ప్రణాళిక, వివరణాత్మక జనాభా వ్యూహాన్ని సిద్ధం చేశారు.

ఇదిలా ఉంటే..  అమిత్ షా బిలియన్ మైండ్స్ పూర్వ విద్యార్థి అనిల్ గౌడపై జేడీఎస్ ఆధారపడింది. జేపీ నగర్‌లో 70 మంది యువకులు అనిల్ గౌడతో కలిసి.. విభిన్న మార్గాన్ని రూపొందించడానికి పని చేస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తన కంచుకోట అయిన కోలార్‌లో తన సొంత వార్‌రూమ్‌ని ప్రారంభించడం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యూహకర్తలు, వారి ప్రణాళికలు ఎంతవరకు విజయం సాధిస్తాయనేది ఈవీఎంలో ఓటర్లు నమోదు చేయబోయే తీర్పు వెల్లడించనుంది. 

నడుము వ్యూహం..
దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని పోలీసులు.. నేరస్తులను అరికట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజస్తాన్ పోలీసులు.. వారిని నియంత్రించడానికి సమర్థవంతమైన వ్యూహాన్ని కనుగొన్నారు. వాళ్లు దానిని పంక్చరింగ్ అంటున్నారు. మరో మాటలో చెప్పాలంటే.. గ్యాంగ్‌స్టర్‌లను అణగదొక్కడానికి పోలీసులు కాల్పులు జరిపి వారి నడుము క్రింద గాయపరచడం. పంక్చరింగ్ చేయబడిన తర్వాత జైపూర్, ధోల్‌పూర్, ఝుఝును, భరత్‌పూర్‌లలో అక్రమార్కులు పని చేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసులను హ్యాపీగా వదిలేయడం వల్ల రానున్న రోజుల్లో పరిణామాలు భారీగా ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

లోటస్ ఈటర్స్..
ఆ ఇద్దరూ రాజస్థాన్‌లో కండలు తిరిగినవారే. ఈ క్రమంలోనే రాష్ట్రం ‘‘శక్తి ప్రదర్శనలు’’ లేదా ‘‘బల ప్రదర్శనలు’’ల పరంపరను చూస్తోంది. రాజా, రాణి సింహాసనంపై దృష్టి పెట్టారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా ప్రకటన చేశారు. వసుంధ రాజే తన పుట్టినరోజు కోసం పెద్ద సంఖ్యలో మద్దతుదారులు రావడంతో.. తాను ఎలాంటి ఆకర్షణను కోల్పోలేదని సంకేతాన్ని పంపారు.

మరోవైపు రాజా కూడా వెనుకంజ వేయలేదు. వసుంధర రాజే సింధియా సీఎం కావడం ఇష్టం లేని వారు చాలా మంది ఉన్నారని ఆయనకు తెలుసు. అయితే వీరిద్దరి మధ్య ఇరుక్కున్న వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఇరువురి బల ప్రదర్శనలకు ఆహ్వానం పొందుతున్నారు. ‘‘ఇధర్ కువాన్ ఉధర్ ఖాయ్’’ నిజంగా రాజా, రాణి మధ్య చిక్కుకున్న ఆ కార్యకర్తల దురదృష్టకర పరిస్థితిని ఇది ప్రతిబింబిస్తుంది.

హామీలు ఇచ్చే ముందు..
ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు వారికి తోచిన విధంగా హామీలు ఇచ్చేయడం పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటుకు భౌగోళిక శాస్త్రాన్ని ముక్కలు చేయడం కేక్ కట్ చేసినంత తేలికగా ఉంటే.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సంతోషించి ఉండేవారు. ప్రస్తుతం గెహ్లాట్ ఎక్కడకు వెళ్లినా.. ‘‘మన కొత్త జిల్లాను మనం ఎప్పుడు పొందుతాము?’’ అనే ప్రశ్న ఆయనను వేధిస్తుంది. అయితే దీనికి గెహ్లాట్‌ వద్ద సమాధానం లేదు.

ఇలాంటి వాగ్దానాలు చేసే ముందు.. ఈ సైబర్ యుగంలో ప్రజల జ్ఞాపకశక్తి తక్కువేమీ కాదనే సంగతి గెహ్లాట్ గ్రహించి ఉండాలి. ఆరు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయనకు బడ్జెట్‌లో మద్దతు లభించని పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సీఎం మౌనం పాటిస్తే ప్రజలు వీధుల్లోకి వస్తారని పార్టీ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి.

రోస్టెడ్ పన్నీర్..
తమిళనాడు ఫ్యూజన్ ఫుడ్‌కు ప్రసిద్ధి. కానీ పొలిటికల్ మెనూలో మాత్రమే రోస్టెడ్ పనీర్ దొరుకుతుంది. ఈ వంటకం ఇటీవల తేని ప్రాంతంలో కనుగొనబడింది. ఇక్కడ ఒక రాజకీయ నాయకుడు కొత్త రాజకీయ అవగాహనను వండడానికి చేసిన ప్రయత్నం పుల్లగా మారింది. కొంగునాడు భోజనంపై కాస్త ఆసక్తి ఉన్న కుంకుమ పార్టీ నేతలకు తన వంటకాన్ని వడ్డించాలనుకున్నారు. కానీ ఆయన రెసిపీలో తక్కువ మంది టేకర్లు ఉన్నారని.. కొత్త కోర్సును చార్ట్ చేయడానికి ఆయన తనకు తానుగా మిగిలిపోయాడని తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పౌర విమానయాన శాఖపై సభ్యుల ప్రశ్నలు | Minister Ram Mohan Naidu Strong Reply | Asianet News Telugu
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India | Modi Speech | Asianet News Telugu