హాస్పిటల్ బెడ్ పైనే... వయసులో వున్న మానసిక వికలాంగురాలిపై కామాంధుడి అఘాయిత్యం

Arun Kumar P   | Asianet News
Published : Jul 11, 2021, 12:28 PM IST
హాస్పిటల్ బెడ్ పైనే... వయసులో వున్న మానసిక వికలాంగురాలిపై కామాంధుడి అఘాయిత్యం

సారాంశం

అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కదల్లేని పరిస్థితిలో వున్న మానసిక వికలాంగురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. ఈ అమానుష ఘటన మైసూరులో చోటుచేసుకుంది.  

మైసూరు: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కసాయి దారుణానికి ఒడిగట్టాడు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మానసిక వికలాంగురాలిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ లైంగిక దాడితో బాధితురాలు మరింత అనారోగ్యానికి గురయ్యింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.   

ఈ అమానుషానికి సంబంధించి బాధితురాలి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మైసూరు పట్టణంలోని  కేఆర్ హాస్పిటల్ లో మతిస్థిమితం సరిగ్గాలేని ఓ 30ఏళ్ల యువతి చికిత్స పొందుతోంది. తీవ్ర అనారోగ్యంతో నిస్సహాయ స్థితిలో వున్న ఆమెపై ఓ కామాంధుడు కన్నేశాడు. 

read more  ఏడేళ్ల మైనర్ బాలికపై అత్యాచారం..!

శుక్రవారం రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో దుండగుడు కిటికీ గ్రిల్స్ తొలగించి యువతి గదిలోకి ప్రవేశించాడు. బెడ్ పై కదల్లేని స్థితిలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో యువతి ఇలా అత్యాచారానికి గురయ్యింది. అయితే ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగ తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించారు. 

ఈ విషయం బయటకు పొక్కితే హాస్పిటల్ కు చెడ్డపేరు వస్తుందని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అయితే బాధితురాలి కుటుంభీకులు మానవ హక్కుల సేవా సమితిని ఆశ్రయించారు.  సేవా సమితి సభ్యులను కూడా ఈ విషయం బయట పెట్టొద్దని  ఆస్పత్రి సిబ్బందిని వైద్యులు బెదిరించినట్లు ఆరోపించారు. 
 

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!