సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఇండియా ఆర్మీ చీఫ్

By narsimha lodeFirst Published Sep 4, 2020, 2:30 PM IST
Highlights

భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె చెప్పారు.

న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె చెప్పారు.

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా  ఆయన చెప్పారు.చర్చల ద్వారా రెండు దేశాల మధ్య నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తూర్పు లడఖ్ లోని ప్యాంగ్యాంగ్ సరస్సు  సమీపంలో చైనా దళాలు రెచ్చగొట్టే చర్యకు దిగాయి. తాను గురువారం నాడు లేహ్ వెళ్లిన తర్వాత సమీక్ష నిర్వహించినట్టుగా ఆయన చెప్పారు.

ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకుగాను తాము సిద్దంగా ఉన్నామని అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గత రెండు మూడు నెలలుగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. 

భారత,చైనా సరిహద్దుల మధ్య వారం రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.చైనా భారత్ సరిహద్దుల్లో భారీగా ఆర్మీని, యుద్ద ట్యాంకులను మోహరించింది. దీంతో భారత్ కూడ సరిహద్దుల్లో భారీగా ఆర్మీని రంగంలోకి దించింది.
 

click me!