తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

Published : Sep 04, 2020, 01:28 PM IST
తమిళనాడులో విషాదం: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు, ఐదుగురి మృతి

సారాంశం

 తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని  కడలూరు జిల్లా కాట్టుమన్నార్ కోయిల్ లో బాణసంచా ఫ్యాక్టరీలో శుక్రవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

చనిపోయినవారంతా మహిళలేనని స్థానికులు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు కారణంగా భవనం కుప్పకూలిపోయింది. 

భవనం శిథిలాలు ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో మరణించిన వారి మృతదేహాలు కూడ చెల్లా చెదురుగా పడ్డాయి. విషయం తెలిసిన వెంటనే స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.

గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రిక తరలించారు. ఈ ప్రమాదానికి గల  కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు. 

గతంలో కూడ బాణసంచా ఫ్యాక్టరీల్లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకొంటున్నా కూడ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోని కారణంగా పదే పదే ఇదే తరహాలో ప్రమాదాలు చోటు చేసుకొంటున్నట్టున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.


 

PREV
click me!

Recommended Stories

ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System
Viral News: చెత్త కుప్ప‌లో చాక్లెట్లు, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డ్డ జ‌నం.. అస‌లు విష‌యం తెలిస్తే