అర్ధరాత్రి మహిళ మంచం మీద కూర్చొని పాదాలను తాకడం ఆమె మోడెస్టీని దెబ్బతీయడమే.. హైకోర్టు సంచలన తీర్పు

By Sumanth Kanukula  |  First Published Dec 25, 2021, 9:53 AM IST

అర్ధరాత్రి వేళ ఒక మహిళ మంచం మీద కూర్చొని, ఆమె పాదాలను తాకడానికి ప్రయత్నించడం ఆమె మోడెస్టీని దెబ్బతీసే (గౌరవం/ మర్యాదను కించపరచడం) నేరమని ఔరంగాబాద్‌లోని  బాంబే హైకోర్టు  బెంచ్ (Bombay High Court bench at Aurangabad) ఇటీవల తీర్పు వెలువరించింది. అపరిచిత వ్యక్తి మహిళ శరీరంలోని ఏదైనా భాగాన్ని తాకడం.. అది మహిళ మోడెస్టీని దెబ్బతీయడంతో సమానని పేర్కొంది. 


అర్ధరాత్రి వేళ ఒక మహిళ మంచం మీద కూర్చొని, ఆమె పాదాలను తాకడానికి ప్రయత్నించడం ఆమె మోడెస్టీని దెబ్బతీసే (గౌరవం/ మర్యాదను కించపరచడం) నేరమని ఔరంగాబాద్‌లోని  బాంబే హైకోర్టు  బెంచ్ (Bombay High Court bench at Aurangabad) ఇటీవల తీర్పు వెలువరించింది. అపరిచిత వ్యక్తి మహిళ శరీరంలోని ఏదైనా భాగాన్ని తాకడం.. అది మహిళ మోడెస్టీని దెబ్బతీయడంతో సమానని పేర్కొంది. వివరాలు.. జల్నా జిల్లాకు చెందిన పరమేశ్వర్ ధాగే(36) అనే వ్యక్తి తన పొరుగువారి మోడెస్టీని కించపరిచినందుకు అతన్ని దోషిగా నిర్దారిస్తూ కింది కోర్టు తీర్పునిచ్చింది. అతనికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 

అయితే దీనిని సవాలు చేస్తూ పరమేశ్వర్ ధాగే  ఔరంగాబాద్‌లోని  బాంబే హైకోర్టు  బెంచ్‌ను ఆశ్రయించాడు. అతడు దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ ముకుంద్ సెవ్లికర్‌తో (Justice Mukund Sewlikar)  కూడిని ధర్మాసం విచారణ చేపట్టింది. 

Latest Videos

undefined

ప్రాసిక్యూషన్ కేసు ప్రకారం.. జూలై 2014లో పరమేశ్వర్ ధాగే ఓ రోజు సాయంత్రం సమయంలో బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె భర్త ఎప్పుడు తిరిగి వస్తాడని అడిగాడు. తన భర్త వేరే ఊరికి వెళ్లాడని.. ఆ రాత్రికి తిరిగి రాడని బాధితురాలు పరమేశ్వర్ ధాగేకు చెప్పింది. తర్వాత పరమేశ్వర్ ధాగే మళ్లీ రాత్రి 11 గంటల సమయంలో బాధితురాలు నిద్రిస్తున్న సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. లోపల నుంచి బోల్ట్ వేయని బాధితురాలి ఇంటి తలుపులు తెరిచి.. ఆమె మంచం మీద కూర్చుని.. పాదాలను తాకాడు. అయితే పరమేశ్వర్ మాత్రం మోడస్టీని కించపరిచే ఉద్దేశం తనకు లేదని వాదించాడు. 

ఈ వివాదాన్ని పరిగణలోని తీసుకున్న ధర్మాసనం.. ‘రికార్డ్‌లో ఉన్న విషయాల ప్రకారం.. పరమేశ్వర్ ధాగే పని.. మహిళ యొక్క భావోద్వేగ స్థితిని దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉందని స్పష్టమవుతుంది. అతను బాధితురాలి పాదాల వద్ద కూర్చున్నాడు. ఆమె పాదాలను తాకాడు. అతను లైంగిక ఉద్దేశంతో అక్కడికి వెళ్లాడని మరియు బాధితురాలి మోడస్టీని దెబ్బతీశాడని ఇది స్పష్టంగా సూచిస్తుంది. అందువల్ల,..ధాగే బాధితురాలిపై వేధింపులకు పాల్పడ్డాడని కింది కోర్టు చెప్పడంలో కింది కోర్టు ఎలాంటి తప్పులేదు’ అని పేర్కొంది. రాత్రిపూట బాధితురాలి ఇంట్లో ఏమి చేస్తున్నాడనే దానిపై ధాగే సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేదని జస్టిస్ సెవ్లికర్ పేర్కొన్నారు. 

click me!