
Nirmala Sitharaman: కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిర్మల సీతారామన్ రాజ్యసభలో శుక్రవారం బడ్జెట్‌పై మాట్లాడుతూ, కరోనా కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిలదొక్కు కోవడానికి, సుస్థిరత సాధించడానికి బడ్జెట్-2022 దోహదపడుతుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కోలుకోవడమేనని ఈ ఏడాది బడ్జెట్ లక్ష్యం చెప్పారు. ఈ కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు.
రాజ్యసభలో ఇవాళ బడ్జెట్‌పై మాట్లాడారు. 2022 బడ్జెట్‌లో పేద ప్రజలను అవహేళన చేస్తున్నారని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అమృత కాలం కాదు అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తన ప్రసంగంలో ఆరోపించారు. ఇవాళ ఆ అంశాన్ని ప్రస్తవిస్తూ.. దేశంలో 2014 నుండి రాహుకాలంలో నడుస్తోందని, ఆ రాహు కాలం తోనే జి-23 సమస్య ఉత్పన్నమైనది ఆర్థిక మంత్రి అన్నారు. రాహు కాలం ఉన్న చోట.. కాంగ్రెస్ పార్టీ కంకషన్‌కు గురైందన్నారు. రాహు కాలం అంటే జీ-23ని సృష్టించే కాలమని చురకలంటించారు.
కాంగ్రెస్ పార్టీలో రాహు కాలం నడుస్తోందని, అందుకే ఆ పార్టీని సీనియర్ సభ్యులు వీడి వెళ్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ.. సీనియర్ నేతలు పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. రాహు కాలం వల్లే కాంగ్రెస్‌లో జీ-23 ఉత్పాతం మొదలైనట్లు ఏద్దేవా చేశారు. ఇటీవల సుమారు 23 మంది సీనియర్ నేతలు .. కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ అధిష్టానికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
అదేవిధంగా 2013లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ చెత్తబుట్టలో వేసిన ఘటనను ప్రస్తావించారు. “అదే రాహుకాలం” అని సీతారామన్ అన్నారు. G-23 అనేది 23 మంది తిరుగుబాటు కాంగ్రెస్ నేతల బృందం. అందులో కపిల్ సిబల్ కూడా ఒకరు.
బీజేపీ ప్రభుత్వం అమృత కాలంలో ఉన్నట్లు మంత్రి సీతారామన్ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ రాహు కాలం ఉన్నందున.. పార్టీలో ఉన్న సీనియర్లు ఆ పార్టీని వీడి వెళ్తున్నట్లు ఆమె అన్నారు. రాహు కాలంలో ఉండడం వల్లే ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చినట్లు మంత్రి నిర్మల విమర్శించారు. రాజస్థాన్ కాంగ్రెస్ 'లడ్కీ హూన్ లడ్ శక్తి హూన్' నినాదాన్ని ఇస్తోందని, కానీ రాజస్థాన్‌లో మహిళలు పోరాడలేకపోతున్నారని సీతారామన్ అన్నారు.