పదేళ్ల బాలుడిపై హత్యాచారం.. ఆడుకుంటానని వెళ్లి నగ్నంగా, పొలాల్లో..విగతజీవిగా....

Published : Feb 11, 2022, 01:42 PM IST
పదేళ్ల బాలుడిపై హత్యాచారం.. ఆడుకుంటానని వెళ్లి నగ్నంగా, పొలాల్లో..విగతజీవిగా....

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని ఓ పదేళ్ల చిన్నారి బాలుడి మీద ముష్కరమూక దాడి చేసింది. అంత్యంత పాశవికంగా హత్యాచారానికి పాల్పడింది. అతని మృతదేహాన్ని నగ్నంగా పొలాల్లో వదిలేసి వెళ్లిపోయింది. 

ఉత్తరప్రదేశ్ : వావివరుసలు, వయోభేదం లేకుండా… చివరికి మూగ జీవాలను కూడా వదలకుండా Sexual assaultsకు  పాల్పడుతున్నాయి మానవ మృగాలు. ఈ క్రమంలో యూపీలో జరిగిన ఓ ఘోరం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ Dalit Minor చిన్నారిని అత్యంత క్రూరంగా హత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.

Uttar Pradesh కాన్పూర్ ఔటర్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది. బాధితులది రైతు కుటుంబం. ఆ రైతు పదేళ్ల కొడుకు సోమవారం మధ్యాహ్నం ఆడుకుంటానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడు.  సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి.. ఊరంతా వెతికి.. రాత్రి సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాత్రి కావడంతో మంగళవారం ఉదయం పోలీసులు వెదకడం ప్రారంభించారు.

ఈ లోపు ఊరి బయట ఆవ చేనులో ఓ బాలుడి Corpseని పనులకు వెళ్లిన ఓ మహిళ గుర్తించింది. వెంటనే స్థానికులు, పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వెళ్లి చూస్తే..అది తప్పిపోయిన మైనర్ బాలుడి మృతదేహంగా గుర్తించారు. బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడి ఆపై హత్య చేసి ఉంటారని  పోలీసులు భావిస్తున్నారు. మృతదేహం nakedగా పడి ఉంది. దుస్తులు 50 మీటర్ల దూరంలో పడి ఉన్నాయి.  

ఘాతుకానికి పాల్పడే సమయంలో ప్రతిఘటించడంతో ఆ పిల్లాడిపై బండరాళ్లతో దాడి చేసి ఉంటారని, కన్నుకి తీవ్రంగా గాయమైందని.. ఒంటిపై పంటి గాట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయినప్పటికీ లైంగిక దాడి జరిగిందా? ఎలా హత్య చేశారు? అనే విషయాల నిర్ధారణ పరీక్ష కోసం శవపరీక్షకై ఎదురు చూస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని  కాన్పూర్ ఏఎస్పీ ఆదిత్య కుమార్ వెల్లడించారు.  

మరోవైపు చనిపోయింది.. పదేళ్ల బాలుడి కావడం, ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటడంతో.. గ్రామస్తుల్లో కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కాసేపు రహదారి దిగ్బంధించి నిరసనలు వ్యక్తం చేశారు. ఆపై పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించారు. 

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 7న Uttar Pradeshలోని గోండా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ Dalit girlపై ఇద్దరు దుండగులు gang rapeకి పాల్పడ్డారు. ఆపై ఆ బాలికను murder చేశారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపై firingకు తెగబడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నవాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి  గ్రామంలోని పంట పొలాల్లో శనివారం ఉదయం ఓ బాలిక dead bodyని స్థానికులు కనుగొన్నారు. శరీరంపై గాట్లు, తీవ్ర గాయాలు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ మార్కండేయ షాహి, ఎస్పీ సంతోష్ మిశ్రా  పోలీసు బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం రాత్రి బహిర్భూమి కోసం బాలిక బయటకు రాగానే నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు పట్టించిన వారికి రూ.25,000 బహుమతి ఇస్తామని కూడా ప్రకటించారు. కాగా ఈ ప్రకటన తర్వాత ఐదు గంటల్లోనే దుండగుల గురించి పోలీసులకు సమాచారం అందింది. 

గ్రామం సమీపంలోని ఓ చెరుకుతోటలో నిందితులు తలదాచుకున్నట్లుగా తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు.  పోలీసులు ఎదురు కాల్పులు జరపగా ఓ దుండగుడి కాలిలోకి తూటాలు దూసుకెళ్లాయి. తీవ్రంగా గాయపడిన నిందితుడు మహేష్ యాదవ్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ సంతోష్ మిశ్రా తెలిపారు.  త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు