నోటితో ఊపిరి: తల్లిని కాపాడుకొనేందుకు బిడ్డల పోరాటం.. కానీ...

Published : May 03, 2021, 08:43 PM ISTUpdated : May 03, 2021, 08:50 PM IST
నోటితో ఊపిరి: తల్లిని కాపాడుకొనేందుకు బిడ్డల పోరాటం.. కానీ...

సారాంశం

ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా సోకిన తన తల్లికి తన నోటితో ఊపిరి అందించింది. ఆక్సిజన్ లేకున్నా  తన తల్లికి ప్రాణవాయువు అందించి కాపాడారు ఆ అక్కాచెల్లెళ్లు.

న్యూఢిల్లీ:ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కరోనా సోకిన తన తల్లికి తన నోటితో ఊపిరి అందించింది. ఆక్సిజన్ లేకున్నా  తన తల్లికి ప్రాణవాయువు అందించి కాపాడారు ఆ అక్కాచెల్లెళ్లు.ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ మహిళకు కరోనా సోకింది. వ్యాధి తీవ్రమైంది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం బహ్రెయిన్‌లోని  మహారాజ్ మహేల్ దేవ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఆసుపత్రిలో  ఆక్సిజన్ కొరత ఉంది. 

శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న రోగులకు అందించేందుకు ఆక్సిజన్ సరిపడు లేదు. ఈ మహిళ ఆసుపత్రికి వెళ్లే సమయానికి ఆక్సిజన్  కొరత తీవ్రంగా ఉంది.  ఆక్సిజన్ కోసం ప్రయత్నించినా కూడ సాధ్యం కాలేదు. దీంతో కొనఊపిరితో ఉన్న తల్లికి ఆమె ఇద్దరు కూతుళ్లు నోటితో ఊపిరి అందించారు.

ప్రాణవాయువు కోసం  విలవిల్లాడుతున్న ఆ తల్లికి ఆక్సిజన్ ను అందించి ప్రాణాలు నిలబెట్టారు. ఆక్సిజన్ సమమ్య నుండి ఆమె కోలుకోంది. అయితే చికిత్స ప్రారంభించే సమయానికి  తల్లి మరణించింది. ఇంత కష్టపడినా తల్లిని కాపాడుకోలేకపోవడంతో వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. అక్కడే ఉన్నవారంతా ఈ దృశ్యాలను చూసిన వారు కూడ కంటతడిపెట్టారు.

 

 


 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?