తమిళనాడులో డిఎంకె విజయం: నాలుక కోసుకొని దేవతకు నైవేద్యం

By narsimha lodeFirst Published May 3, 2021, 7:11 PM IST
Highlights

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లో డిఎంకె  ఘన విజయం సాధించడంతో  ఆ పార్టీ అభిమాని నాలుకను కోసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. 

చెన్నై: తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక్లో డిఎంకె  ఘన విజయం సాధించడంతో  ఆ పార్టీ అభిమాని నాలుకను కోసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలో  పదేళ్ల తర్వాత డిఎంకె అధికారంలోకి వచ్చింది. డిఎంకె 133 స్థానాల్లో విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలుపుకొని డిఎంకె కూటమి 159 స్థానాలను దక్కించుకొంది. 

also read:తమిళనాడు సీఎంగా స్టాలిన్: ఈ నెల 7న ప్రమాణం

ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణం చేయనున్నారు. డిఎంకె అధికారంలోకి వస్తే  తన నాలుకను  కోసుకొని అమ్మవారికి నైవేద్యంగా  సమర్పిస్తానని  వనిత అనే డిఎంకె అభిమాని ముత్తలమ్మాన్ అమ్మవారికి మొక్కుకొంది. పదేళ్ల తర్వాత డిఎంకె అధికారంలోకి రావడంతో  ముత్తలమ్మాన్ అమ్మవారికి వనిత తన మొక్కును తీర్చుకొంది. 

కరోనా నేపథ్యంలో ఈ ఆలయం మూసి ఉంది. అయినా కూడ ఆలయం గేటు బయటే నిల్చుని తన నాలుకను ఆమె కోసుకొంది. తెగిన నాలుకను ఆమె గేటు బయటపెట్టి వెళ్లిపోయింది.  ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు   వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కోలుకొంటుంది. గతంలో కూడ జయలలిత విజయం సాధిస్తే నాలుక కోసుకొన్న ఘటనలు కూడ చోటు చేసుకొన్నాయి. 


 

click me!