బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తమ్ముడిని హతమార్చిన అక్క.. వారికి అడ్డువస్తున్నాడనే దారుణం

Published : Sep 13, 2022, 06:02 AM IST
బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తమ్ముడిని హతమార్చిన అక్క.. వారికి అడ్డువస్తున్నాడనే దారుణం

సారాంశం

జార్ఖండ్ జిల్లా రామగడ్‌లో ఓ అక్క, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి సొంత తమ్ముడినే హతమార్చింది. తన బాయ్‌ఫ్రెండ్‌తో సంబంధాన్ని ఇష్టపడని తమ్ముడిని మొత్తంగానే తొలగించుకోవాలని అనుకున్నారు. అయితే, కొడుకు కనిపించడం లేదని తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో గుట్టురట్టు అయింది.  

రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడు అని కూడా చూడకుండా ఆ అక్క తమ్ముడి మర్డర్‌కే ప్లాన్ చేసింది. తన లవ్ రిలేషన్‌షిప్‌లో తరుచూ అడ్డుతగులుతున్నాడని ఏకంగా తమ్ముడిని లేకుం చేయాలని అనుకుంది. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తమ్ముడినే హతమార్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామగడ్ జిల్లాలో చోటుచేసుకుంది.

రామగడ్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల చంచల కుమారి పత్రాటు థర్మల్ పవర్ స్టేషన్ క్వార్టర్‌లో ఒంటరిగా జీవిస్తున్నది. ఇక్కడకు ఆమె బాయ్‌ఫ్రెండ్ సోను అన్సారీ తరుచూ వచ్చేవాడు. కానీ, వీరి మధ్య రిలేషన్‌షిప్.. చంచల కుమారి సోదరుడు 21 ఏళ్ల రోహిత్ కుమార్‌కు మింగుడు పడలేదు., తరుచూ వారించేవాడు. చంచల కుమారి బాయ్‌ఫ్రెండ్‌ది వేరే కమ్యూనిటీ కావడం కూడా రోహిత్ కుమార్ నిరాకరణకు ఒక కారణంగా ఉన్నది.

ఏదేమైనా రోహిత్ కుమార్‌ను చంపేయాలని చంచల కుమారి, ఆమె బాయ్‌ఫ్రెండ్ సోను అన్సారీలు అనుకున్నారు. అనుకున్నదే తడవుగా చంచల కుమారి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. కత్తితో పొడిచి చంపేసింది. ఆ తర్వాత ఆ పీటీపీఎస్ స్థలంలోనే గోతి తవ్వి పాతిపెట్టారు.

కుమారుడు కనిపించకుండా పోవడంతో తండ్రి నరేశ్ మహతో పత్రాటు పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ ఆధారంగా పోలీసులు డెడ్ బాడీని కనిపెట్టి వెలికి తీశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100 వేలు..!
Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే