Siddaramaiah| అప్పులు చేసి.. ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసుకోవద్దు: సీఎం సిద్ధరామయ్య

By Rajesh Karampoori  |  First Published Sep 28, 2023, 4:45 AM IST

Siddaramaiah: ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడానికి రుణాలు తీసుకోవడం మానుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాజంలో సాదాసీదాగా సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సిద్ధరామయ్య అన్నారు.  


Siddaramaiah: అప్పు చేసి పెళ్లి చేసుకోవడం అనారోగ్యకరమనీ, పేద, మధ్యతరగతి వర్గాల వారు గొప్పలకు పోయి.. అప్పులు చేసి ఆడంబరంగా వివాహ వేడుకలు చేసుకోవడం ఆపాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. సమాజంలో సాధారణ, సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని అన్నారు.

మైసూరు సమీపంలోని చామరాజనగర్‌లోని శ్రీ మలై మహదేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన సామూహిక వివాహ వేడుకలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ..పేద, మధ్యతరగతి వర్గాల వారు గొప్పలకు పోయి అప్పుల ఊబిలో పడకూడదనీ, ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవడం వారి పెను భారంగా మారుతోందని అన్నారు. కొందరూ వ్యవసాయ రుణాలు తీసుకొని సమాజంలో పేరు కోసం ఘనంగా పెళ్లుళ్లు చేస్తున్నారని అన్నారు. ఆ అప్పులు తీర్చాలంటే.. జీవితాంతం కష్టపడాల్సి వస్తోందని అభిప్రాయ పడ్డారు. అందుకే సాదాసీదాగా జరిగే సామూహిక వివాహాలను ప్రోత్సహించాలని సీఎం పిలుపునిచ్చారు. 

Latest Videos

MM హిల్ టెంపుల్

ఈ సందర్భంగా మహదేశ్వర ఆలయం గురించి మాట్లాడుతూ.. ఈ ఆలయం ప్రస్తుతం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన పవిత్ర ప్రదేశమని అన్నారు. తాను తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక మలై మహదేశ్వర్ డెవలప్‌మెంట్ అథారిటీని ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. గతంలో తీసుకున్న చర్యల వల్ల ఆలయ ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు.  కర్ణాటక సర్కార్ అమలు చేస్తున్న శక్తి యోజన ఫలితంగా భక్తులు ముఖ్యంగా మహిళా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మలై మాదేశ్వరుని దర్శనం చేసుకుంటున్నారని ఆయన అభినందించారు.

 

సిఎం ముఖ్య మంత్రి మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో మలై మహదేశ్వర్ ఆలయ రూపురేఖలు మారుస్తామని తెలిపారు. తాగునీరు, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ శాంతమల్లికార్జున స్వామి వారి పరమ పవిత్రమైన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామి వారి సన్నిధిలో పట్టాడ గురుస్వామి వారు అధ్యక్షత వహించారు.  
 
మలై మహదేశ్వర్ కొండపై ఉన్న భవనం పేరు మారుస్తున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీశ్రీశ్రీ శాంతమల్లికార్జున స్వామి వారి పరమ పవిత్రమైన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శివరాత్రి దేశికేంద్ర మహాస్వామి వారి సూచన మేరకు తపోభవనం గా పేరు మార్చామని తెలిపారు. మాహేశ్వరుడు తపస్సు చేసిన శక్తి కేంద్రం ఇది. అందుకే తపోభవనం అన్నారని  తెలిపారు.

click me!