లోయలో పడ్డ వాహనం .. ఇద్దరు పోలీసుల మృతి.. పలువురికి తీవ్రగాయలు

By Rajesh Karampoori  |  First Published Sep 28, 2023, 2:05 AM IST

జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది.  ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరూ పోలీసులు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు.


జమ్మూ కాశ్మీర్‌ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ పోలీసు అధికారులు చనిపోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్‌ దగ్గర జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందర్‌కోట్‌లోని ఓ డ్యామ్‌ సమీపంలో వేగంగా వెళ్లున్న ఓ  వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక ప్రత్యేక పోలీసు అధికారి (SPO), ఓ పోలీసు అధికారి మృతి చెందారు. ఈ తరుణంలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు అధికారులు సమాచారం అందించారు.

Latest Videos

చందర్‌కోట్‌లోని ఓ డ్యామ్‌ దగ్గర ఈ ప్రమాదం జరిగిందని ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో ఎస్‌పిఓ స్వామి రాజ్ మరణించారని, పోలీసులు సహా ముగ్గురు గాయపడ్డారు . సేవా సింగ్,  పర్వేజ్ అహ్మద్‌లను ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అహ్మద్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

భారీ పేలుడు.. సైనికుడికి తీవ్రగాయాలు

మరోవైపు.. జమ్మూ డివిజన్‌లోని రాజోరి జిల్లాలోని నౌషేరా సెక్టార్‌లో భారత్-పాకిస్తాన్ నియంత్రణ రేఖ సమీపంలో పేలుడు సంభవించింది. ఆ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు గస్తీ కాస్తున్న సమయంలో ఒక సైనికుడి కాలు ప్రమాదవశాత్తు ల్యాండ్‌మైన్‌పై పడింది, ఆ తర్వాత పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు.

ఇతర సైనికులు వెంటనే గాయపడిన వారిని ప్రథమ చికిత్స కోసం ఝంగర్‌కు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం సైనికుడిని హెలికాప్టర్‌లో ఉదంపూర్‌ కమాండ్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సైనికుడిని నాయక్ ధీరజ్ కుమార్‌గా గుర్తించారు.

అనంతనాగ్‌లో భారీ పేలుడు, ఎనిమిది మంది మృతి

మరోవైపు.. కాశ్మీర్ లోయలోని అనంత్‌నాగ్ జిల్లా లర్కిపోరాలో బుధవారం ఉదయం ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు గాయపడగా.. వారిని చికిత్స కోసం  GMC అనంతనాగ్‌కు తీసుకెళ్లారు.  అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.

సమాచారం ప్రకారం, బుధవారం అనంత్‌నాగ్‌లోని లర్కిపోరా ప్రాంతంలో వాహనంలో పేలుడు సంభవించింది. స్థానిక మార్కెట్ సమీపంలో బుధవారం ఉదయం ఈ పేలుడు జరిగింది. పేలుడు శబ్ధం విని చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత వాహనం నుంచి పొగలు రావడాన్ని ప్రజలు చూశారు. ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు, ప్రజలు క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి ఇతర వాహనాల సాయంతో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారంతా వలస కూలీలే. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం, ఇతర అధికారులు పేలుడు జరిగిన తీరును పరిశీలించారు.

click me!