భార్య చెల్లెలి పై కన్నేసిన ఎస్ఐ.. చివరకు...

Published : Nov 10, 2018, 11:32 AM IST
భార్య చెల్లెలి పై కన్నేసిన ఎస్ఐ.. చివరకు...

సారాంశం

పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ.. మరికొందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తే.... అడ్డదారి తొక్కాడు.

పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ.. మరికొందరికీ ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తే.... అడ్డదారి తొక్కాడు. చివరకు తన తోటి పోలీసుల చేతిలో అరెస్టు అయ్యాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా అందియార్ సమీపంలో అప్పకూడల్ కుళియంగూరు ప్రాంతానికి చెందిన వెంకటాచలం(43) గోబిచెట్టిపాళయం ప్రొహిబిషన్ శాఖలో ఎస్ఐ గా పనిచేస్తున్నాడు.  కాగా.. అతనికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఎప్పటి నుంచో వెంకటాచలానికి తన భార్య చెల్లెలు దివ్యభారతి(32)పై కన్ను ఉంది.

ఈ నేపథ్యంలో.. గత నెలలో వెంకటాచలం తన మరదలు దివ్యభారతిని కిడ్నాప్ చేశాడు. బలవంతంగా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. కాగా.. అతని ప్రయత్నం ఫెయిల్ అయ్యింది. ఇదిలా ఉండగా..దివ్యభారతితో పెళ్లి అయినట్లు ఫేక్ ఫోటోలు క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా... శుక్రవారం వెంకటాచలం ని అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

మీకు SBI లో అకౌంట్ ఉందా..? అయితే మీ ఫోన్ నుండే ఈజీగా రూ.35,00,000 పొందండిలా..
Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu