ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి ఎస్ఐ ప్రయత్నం.. బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదిన గ్రామస్తులు

Published : Sep 19, 2023, 12:23 PM IST
ఇంట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి ఎస్ఐ ప్రయత్నం.. బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదిన గ్రామస్తులు

సారాంశం

ఓ పోలీసు అధికారి అర్థరాత్రి సమయంలో మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. దీంతో గ్రామస్తులు అతడిని బంధించారు. బట్టలు తీసేసి, స్తంభానికి కట్టేశారు. అనంతరం అతడిపై దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అతడో ఎస్ఐ. తన పోలీసు స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత అతడిది. ప్రజల మాన, ధన, ప్రాణలను రక్షించాల్సిన అతడి బుద్ది గడ్డి తిన్నది. ఓ మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీనిని ఆ గ్రామస్తులు గమనించారు. లోపలికి వెళ్లి అతడి బట్టలూడదీసి, స్తంభానికి కట్టేసి, చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. ఆగ్రా జిల్లాలోని బర్హాన్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సందీప్ కుమార్ తన పరిధిలోని ఓ గ్రామానికి ఆదివారం రాత్రి సమయంలో వెళ్లాడు. అర్థరాత్రి ప్రాంతంలో ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడు ఇంట్లోకి చొరబడటాన్ని ఆ గ్రామస్తులు గమనించారు. 

ఎస్ఐ తీరుపై అనుమానం వచ్చిన గ్రామస్తులు ఆ ఇంటికి వెళ్లారు. ఎలాగోలా ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో మహిళపై లైంగిక దాడికి అతడు ప్రయత్నిస్తున్నాడు. వెంటనే అతడిని నిలువరించారు. మహిళను కాపాడారు. అనంతరం ఇంట్లో నుంచి ఎస్ఐని బయటకు లాక్కొచ్చారు. బట్టలూడ దీసి, ఓ స్తంభానికి కట్టేశారు. అక్కడ చితకబాదారు. దీనిని అక్కడున్న పలువురు తమ సెల్ ఫోన్ ద్వారా వీడియో తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. 

ఈ వీడియో ఉన్నతాధికారులకు చేరింది. దీంతో ఆగ్రా పోలీస్ కమిషనర్ ఆ ఎస్ఐను సస్పెండ్ చేశారు. దీంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడైన ఎస్ఐపై అత్యాచారం కేసు నమోదు చేశారు. అయితే ఆ ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. అత్యాచార ఆరోపణలను ఎస్ఐ సందీప్ కుమార్ ఖండించారు, విచారణ కోసం తాను ఆ మహిళ ఇంటికి వెళ్లానని, అప్పుడే తనపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారని చెప్పారు. కాగా.. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌