ప్రయాగరాజ్‌లోని శృంగవేరపురం, శ్రీరాముని వనవాసానికి సంబంధించినది. ఇక్కడే ఆయన నిషాదరాజుని కలిసి, గంగానదిని దాటారు. మహా కుంభమేళా 2025 సందర్భంగా ఇక్కడ ఓ అద్భుతమైన కారిడార్, నిషాదరాజ్ పార్క్ నిర్మించారు.
ఉత్తరప్రదేశ్: ప్రయాగరాజ్ సనాతన సంస్కృతికి నిలయం... ప్రాచీన నగరాల్లో ఇదీ ఒకటి. వేదాలు, పురాణాలు, రామాయణ, మహాభారతం వంటి గ్రంథాల్లో ప్రయాగరాజ్ ప్రాముఖ్యత గురించి వుంది. శ్రీరాముని జీవితంతో ప్రయాగరాజ్‌కి ప్రత్యేక సంబంధం ఉంది. రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు ప్రయాగరాజ్‌లోని శృంగవేరపురంలో బస చేసినట్లు ఉంది. అక్కడ ఆయన తన బాలమిత్రుడైన నిషాదరాజు సాయంతో గంగానది దాటి భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లారు. శృంగి ఋషి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి శృంగవేరపురం అనే పేరు వచ్చింది.
ఇంతటి చరిత్ర కలిగిన శృంగవేరపురంను ప్రయాగరాజ్ కుంభమేళా వేళ ప్రజలకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. అక్కడ ఓ అద్భుత కారిడార్, భారీ విగ్రహాలు, నిషాదరాజ్ పార్క్ నిర్మించారు.
undefined
శృంగవేరపురంతో శ్రీరాముడికి చాలా దగ్గర సంబంధం ఉంది. పుత్రకామేష్టి యాగానికి దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి సలహా మేరకు శృంగి ఋషిని అయోధ్యకు తీసుకొచ్చారు. శృంగి ఋషి చేసిన యాగ ఫలితంగానే దశరథుడికి నలుగురు కుమారులు జన్మించారు. శృంగి ఋషి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి శృంగవేరపురం అనే పేరు వచ్చింది. ఇప్పటికీ శృంగవేరపురంలో శృంగి ఋషి, శాంతాదేవి ఆలయం ఉంది. అక్కడ భక్తులు సంతానం కోసం పూజలు చేస్తారు.
శ్రీరాముడు, ఆయన బాలమిత్రుడు నిషాదరాజు కలిసిన ప్రదేశం ఇదే. శ్రీరాముడు తన బాలమిత్రుడైన నిషాదరాజుని కలిసింది ఇక్కడే. రామాయణంలో దశరథుని ఆజ్ఞ ప్రకారం శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు మొదట శృంగవేరపురానికే వచ్చారు. ఇక్కడ ఆయన తన బాలమిత్రుడైన నిషాదరాజుని కలిశారు. ఆయన కోరిక మేరకు రాత్రి అక్కడే బస చేశారు. ఆ కేవట గ్రామం ఇప్పటికీ రామ్‌చౌరా అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. గంగానది ఒడ్డున రామశయన ఆశ్రమం ఉంది. శ్రీరాముడు సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి ఇక్కడే రాత్రి గడిపినట్లు నమ్ముతారు. శృంగవేరపురం ఘాట్ నుంచే నిషాదరాజు శ్రీరాముడిని తన పడవలో గంగ దాటించి, భరద్వాజ ముని ఆశ్రమానికి తీసుకెళ్లాడు.
సీఎం యోగి ఆధ్వర్యంలో అద్భుత కారిడార్, నిషాదరాజ్ పార్క్ నిర్మాణం చేసారు. మహా కుంభమేళా 2025 సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శృంగవేరపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. సుమారు 14 కోట్ల రూపాయలతో అద్భుత కారిడార్ నిర్మించారు. శ్రీరాముడు, నిషాదరాజుల 52 అడుగుల విగ్రహం, పార్క్ నిర్మించారు. దీనిని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించారు. శృంగవేరపురంలో గంగానది ఒడ్డున సంధ్యా, రామ్‌చౌరా ఘాట్‌లలో, నిషాదరాజ్ పార్క్‌లో శ్రీరాముని ఆగమన దృశ్యాలతో చిత్రాలు వేశారు. పర్యాటక శాఖ భక్తుల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేసింది.