స్నేహితుడిని కలిసినందుకు శ్రద్దా వాకర్ ను హతమార్చిన అఫ్తాబ్ పూనావాలా : చార్జిషీట్ లో కీల‌క విష‌యాలు

By Mahesh RajamoniFirst Published Jan 25, 2023, 10:40 AM IST
Highlights

New Delhi: మే 18, 2022న ఒక స్నేహితుడిని కలుసుకున్న కారణంగా శ్రద్ధా వాకర్‌ని ఆమె లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా హత్య చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. స్నేహితుడిని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 
 

Shraddha Walkar murder case: దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ఆమె లైవ్-ఇన్ భాగస్వామి ఆఫ్తాబ్ పూనావాలాపై హత్య, సాక్ష్యాలను ధ్వంసం చేశారంటూ పోలీసులు మంగళవారం చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, మే 18, 2022న ఒక స్నేహితుడిని కలుసుకున్న కారణంగా శ్రద్ధా వాకర్‌ని ఆమె లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా హత్య చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.స్నేహితుడిని కలిసినందుకే హతమార్చడని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. 

వివ‌రాల్లోకెళ్తే.. మే 18, 2022న ఒక స్నేహితుడిని కలుసుకున్న కారణంగా శ్రద్ధా వాకర్‌ని ఆమె లైవ్-ఇన్ భాగస్వామి అఫ్తాబ్ పూనావాలా హత్య చేశారని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నేరపూరిత కుట్ర అభియోగాలు మోపబడని ఆఫ్తాబ్ పూనావాలా.. ఇద్దరి మధ్య వాత్సల్యం తగ్గిపోయిందనీ, ఆఫ్తాబ్ ఆమెను వదిలించుకోవాలనుకున్నందున శ్రద్ధను చంపాడని ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 6,629 పేజీల తొలి ఛార్జిషీట్‌లో మే 17, 2022న అఫ్తాబ్, శ్రద్ధా.. వారి వార్షికోత్సవం సందర్భంగా (వారు మొదటిసారిగా కలిసిన రోజు) గొడవ పడ్డారని, ఆ తర్వాత ఆమె ఒక రాత్రి ఇంట్లో బస చేసిందని పేర్కొంది.  మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చిన ఆమెను అఫ్తాబ్ హత్య చేశాడ‌ని పోలీసులు తెలిపారు. అఫ్తాబ్ తన భాగస్వామి శరీరాన్ని 18-24 ముక్కలుగా చేసి, నెలల తరబడి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచి, వాటిని వివిధ ప్రదేశాలలో పారవేశాడ‌ని పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీస్ సదరన్ రేంజ్ జాయింట్ సీపీ మీను చౌదరి మాట్లాడుతూ, "సంఘటన జరిగిన రోజు, శ్రద్ధా వాక‌ర్ స్నేహితురాలిని కలవడానికి వెళ్లడం నిందితుడికి నచ్చలేదు. ఈ క్రమంలో అతడు హింసాత్మకంగా మారి ఈ ఘటనకు పాల్పడ్డాడు" అని తెలిపారు. శ్రద్ధా వాక‌ర్ హత్య కేసులో అఫ్తాబ్ అమీన్ పూనావాలాపై ఢిల్లీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలోని సాకేత్ కోర్టులో 6,629 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుడు అఫ్తాబ్ పూనావాలాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. 6,500 పేజీలకు పైగా ఉన్న ఈ చార్జిషీట్ లో 100 మంది సాక్షుల వాంగ్మూలాలతో పాటు నెలల తరబడి దర్యాప్తు, సోదాల అనంతరం పోలీసులు సేకరించిన కేసుకు సంబంధించిన ఫోరెన్సిక్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను పొందుపరిచారు.

అఫ్తాబ్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు రెండు వారాల పాటు ఫిబ్రవరి 7 వరకు పొడిగించింది.  ఫిబ్రవరి 7న అతడిని భౌతికంగా కోర్టులో హాజరుపర్చాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మంగళవారం విచారణ సందర్భంగా అఫ్తాబ్ మేజిస్ట్రేట్ ను ఛార్జీషీట్ అందుకుంటారా అని ప్రశ్నించగా, ప్రస్తుత న్యాయవాదిని మార్చాలని భావిస్తున్నందున దానిని తన న్యాయవాదికి ఇవ్వరాదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 7న చార్జిషీట్‌పై విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ తెలిపారు.

శ్రద్ధా వాక‌ర్ హత్య కేసు

అఫ్తాబ్ పూనావాలా తన లైవ్-ఇన్ భాగస్వామి శ్రద్ధా వాకర్‌ను మే 18, 2022న గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు శ్రద్ధా వాకర్ మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీలోని తన నివాసంలో దాదాపు మూడు వారాల పాటు 300-లీటర్ల ఫ్రిజ్‌లో ఉంచి, చాలా రోజుల పాటు వాటిని నగరం అంతటా పడేశాడు. గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్ 3లోని పొదల్లోని తన కార్యాలయం సమీపంలో మృతదేహాన్ని నరికివేయడానికి ఉపయోగించిన రంపాన్ని, బ్లేడ్‌ను పారవేసినట్లు విచారణలో అతను అంగీకరించాడని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితుడు ప్రతిరోజూ రాత్రి తన బ్యాగ్‌లో శ్రద్ధా మృతదేహా భాగాల‌ను పారవేసేందుకు బయటకు వెళ్లేవాడ‌ని పోలీసులు వ‌ర్గాలు తెలిపాయి. ఇది చాలా రోజుల పాటు కొనసాగింది. ఈ స‌మ‌యంలో నిందితుడు అఫ్తాబ్ ఇతర మహిళల‌ను సైతం క‌లిశాడ‌ని తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలు తన ఫ్రిజ్‌లో పడి ఉన్నప్పుడు కూడా వారిని ఇంటికి తీసుకువచ్చాడని వెల్ల‌డించారు.

click me!