కూతురిని మీద ఎక్కించుకొని తండ్రి కసరత్తులు.. క్యూట్ వీడియో..!

Published : Jan 25, 2023, 10:29 AM IST
కూతురిని మీద ఎక్కించుకొని తండ్రి కసరత్తులు.. క్యూట్ వీడియో..!

సారాంశం

సందీప్ మాల్ అనే యూజర్ దీనిని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో 12 సెకన్లు ఉండగా... ఆ వీడియోలో సందీప్ జిమ్ లో పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు.

తండ్రి, కూతుళ్ల బంధం చాలా స్పెషల్ గా ఉంటుంది. దాదాపు ప్రతి తండ్రి... తమ కూతురిని చాలా అపురూపంగా చూసుకుంటారు. వారి ఇరువురిని కలిపి చూస్తే... చాలా క్యూట్ గా, చూడటానికి అందంగా కనిపిస్తుంది.   తాజాగా.. ఓ తండ్రి, కూతుళ్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

ఓ తండ్రి, తన కూతురిని భుజాలపై కూర్చొపెట్టుకొని పుష్ అప్స్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సందీప్ మాల్ అనే యూజర్ దీనిని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఈ వీడియో 12 సెకన్లు ఉండగా... ఆ వీడియోలో సందీప్ జిమ్ లో పుష్ అప్స్ చేస్తూ కనిపించాడు. అయితే.... ఆయన అదనపు బరువుగా...తన ముద్దుల కుమార్తెను కూర్చోపెట్టుకున్నాడు.  ఆ పాప... అతనిని గట్టిగా పట్టుకొని కూర్చొంది. ఈ వీడియో చూడటానికి చాలా అందంగా ఉంది.

కాగా.. తన మూడేళ్ల కూతురు 18కేజీల బరువు ఉందని... ఆ అదనపు బరువుతో తాను పుష్ అప్స్ చేశానంటూ  అతను షర్ చేశాడు. ఈ వీడియోకి వేలల్లో వ్యూస్ రావడం గమనార్హం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Forbidden Places: ఇండియాలోనే ఉన్నా భారతీయులకు నో ఎంట్రీ.. విదేశీయులకు మాత్రం పర్మిషన్.. ఆ 5 రహస్య ప్రాంతాల మిస్టరీ ఏంటి?