సింహం పై దాడి చేసిన దున్నపోతుల గుంపు... వీడియో వైరల్...!

Published : Nov 25, 2022, 09:54 AM IST
 సింహం పై దాడి చేసిన  దున్నపోతుల గుంపు... వీడియో వైరల్...!

సారాంశం

ఈ వీడియోని డియోన్ కెల్‌బ్రిక్ అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సఫారీలో పర్యాటకుల బృందంతో పంచుకున్నారు. ముసలి సింహం పై దున్నపోతుల మంద కొమ్ములతో దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి.


సింహం... అడవికి రారాజు. సింహం వేట మొదలుపెడితే... ఏ జంతువు అయినా వణికిపోవాల్సిందే. అలాంటిది....  సింహం ముసలిది కావడంతో... దానిపై దున్నపోతుల గుంపు దాడి చేసింది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం.  ఓపిక లేకుండా ఉన్న ముసలి సింహం పై దున్నపోతుల గుంపు దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 


ఈ వీడియోని డియోన్ కెల్‌బ్రిక్ అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సఫారీలో పర్యాటకుల బృందంతో పంచుకున్నారు. ముసలి సింహం పై దున్నపోతుల మంద కొమ్ములతో దాడి చేస్తున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. "  మగ సింహం గేదెల మంద మధ్య చిక్కుకుని ప్రాణాల కోసం పోరాడుతుంది" అని క్యాప్షన్ ఇచ్చారు.

నిద్రపోతున్న సింహం పై ఈ దున్నపోతుల మంద వెళ్లి కొమ్ములతో పొడుస్తూ... దానిని రెచ్చగొట్టాయి. పాపం వాటి నుంచి తప్పించుకునేందుకు దాదాపు 15 నిమిషాల పాటు దాడి చేయడం గమనార్హం. దాడి జరిగిన మూడు రోజుల తర్వాత సింహం చనిపోయిందని ఫోటోగ్రాఫర్ నెటిజన్లకు కామెంట్ ద్వారా తెలియజేశారు.


ఈ వీడియో కి ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు రావడం గమనార్హం. పాపం సింహం పడుతున్న బాధ ను చూసి... నెటిజన్లు బాధను వ్యక్తం చేయడం గమనార్హం.  సింహాన్ని అలా చూడటానికి తమకు మనసు రావడం లేదని నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Stock Market Today: ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది? ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన గ్లోబల్ అప్‌డేట్స్ ఇవే !
Jagannath Puri Rath Yatra 2026: కదలనున్న జగన్నాథ రథ చక్రాలు | Lord Jagannath Darshan