షాకింగ్ : రాజస్థాన్‌లో గిరిజన మహిళ బట్టలు విప్పి, నగ్నంగా ఊరేగించి... వీడియోలు వైరల్

Published : Sep 02, 2023, 08:47 AM ISTUpdated : Sep 02, 2023, 08:49 AM IST
షాకింగ్ : రాజస్థాన్‌లో గిరిజన మహిళ బట్టలు విప్పి, నగ్నంగా ఊరేగించి... వీడియోలు వైరల్

సారాంశం

కుటుంబ వివాదాల కారణంగా ఓ గిరిజన మహిళను ఆమె అత్తింటివారు... వివస్త్రను చేసి.. ఊర్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో కలకలం సృష్టించింది. 

జైపూర్ : ప్రతాప్‌గఢ్ జిల్లాలోని ధరియావాడ్ పట్టణంలో ఒక గిరిజన మహిళను ఆమె అత్తమామలు వివస్త్రను చేసి ఊరేగించిన సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన కొన్ని రోజుల క్రితం జరిగింది. కానీ ఆలస్యంగా.. ఈ శుక్రవారం వెలుగులోకి వచ్చింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగు చూసింది. అందులో ఓ వ్యక్తి...బాధిత గిరిజన మహిళ ఏడుస్తుండగా...అందరూ చూస్తుండగానే ఆ మహిళ దుస్తులను తొలగిస్తున్నాడు. బాధతో ఆ మహిళ ఏడుస్తోంది. ఈ వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కలకలంగా మారింది. మహిళలకు భద్రత లేదంటూ బీజేపీ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

మ‌హిళ‌కు వేధింపులు: చితకబాదిన స్థానికులు.. ఆపై శిరోముండనం, బూట్ల దండల‌తో..

ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయం గురించి రాత్రి 11.27 గంటలకు ఎక్స్‌లో రాశారు. కుటుంబ వివాదాల కారణంగా మహిళ అత్తమామలు ఆమెను వివస్త్రను చేశారని చెప్పారు. ఘటనా స్థలానికి ఏడీజీ క్రైం దినేష్‌ ఎంఎన్‌ను పంపి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు సీఎం తెలిపారు.

"ప్రతాప్‌గఢ్ జిల్లాలో.. కుటుంబం వివాదాలు, అత్తమామల మధ్య గొడవల కారణంగా ఒక మహిళను ఆమె అత్తమామలు వివస్త్రను చేసిన వీడియో బయటపడింది. దీనిమీద కఠిన చర్యలు తీసుకోవాలని వెంటనే పరిశీలించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశాం. డీజీపీ ఆదేశాల మేరకు క్రైం ఏడీజీ ఎం.ఎన్. దినేష్ సంఘటనా స్థలానికి వెళ్లి, పరిశీలించారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటారు. 

ఇలాంటి నేరగాళ్లకు సమాజంలో స్థానం లేదు’’ అని సీఎం ఎక్స్ లో రాశారు. నాగరిక సమాజంలో ఇలాంటి నేరగాళ్లకు చోటు లేదని, ఈ నేరగాళ్లను వీలైనంత త్వరగా కటకటాల వెనక్కి నెట్టి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరిపి శిక్షిస్తామని సీఎం తెలిపారు. 

రాష్ట్ర పోలీసులు శుక్రవారం అర్థరాత్రి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు, మహిళ, నిందితులు ఇద్దరూ గిరిజన వర్గానికి చెందినవారని సూచిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహిళ మాజీ మామగారు అని, అతను ఇతర కుటుంబ సభ్యులతో కూడా సంబంధం కలిగి ఉన్నాడని పిహెచ్‌క్యూ తెలిపింది.

ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది నిందితులను గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీజీపీ ఉమేష్ మిశ్రా తెలిపారు. ప్రతాప్‌గఢ్ ఎస్పీ అమిత్ కుమార్ ఆధ్వర్యంలోని ఒక బృందాన్ని అనుమానితులందరినీ అరెస్టు చేయాలని కోరినట్లు బన్స్వారా ఐజిపి ఎస్ పరిమళ తెలిపారు. 

ఈ ఘటనలో ఆలస్యం జరగడం గురించి అడిగినప్పుడు, సోషల్ మీడియాలో వీడియో సర్క్యులేట్ అయిన తరువాతే దీని గురించి తమకు తెలిసిందని పోలీసులు చెప్పారు. అర్థరాత్రి వరకు, ధరియావాడ్ సమీప ప్రాంతాలలో రైడ్స్, సెర్చ్ ఆపరేషన్ లు జరిగాయి. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్