మమత తల తెస్తే కోటి రూపాయలు

Published : Jun 10, 2019, 02:44 PM ISTUpdated : Jun 10, 2019, 02:59 PM IST
మమత తల తెస్తే కోటి రూపాయలు

సారాంశం

పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి తల కానీ, ఆమెను సజీవంగా పట్టుకొని తీసుకొస్తే కోటి రూపాయల బహుమతి అందిస్తామని  టీఎంసీ నేత అపురూప పొద్దార్ కు ఓ లేఖ అందింది.ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేసి తల కానీ, ఆమెను సజీవంగా పట్టుకొని తీసుకొస్తే కోటి రూపాయల బహుమతి అందిస్తామని  టీఎంసీ నేత అపురూప పొద్దార్ కు ఓ లేఖ అందింది.ఈ లేఖపై పొద్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీదీని  హత్య చేస్తే  కోటి రూపాయాలు బహుమతిగా ఇస్తామని  రాజీవ్ కిల్లా పేరుతో టీఎంసీ నేత పొద్దార్ కు లేఖ అందింది. ఈ లేఖలో రాజీవ్ కిల్లా చిరునామాతో పాటు మూడు ఫోన్ నెంబర్లను కూడ ఇచ్చాడు. 

జై శ్రీరాం నినాదాలకు వ్యతిరేకంగా మమత కుట్రపన్నారని బీజేపీ ఎంపీ  సాక్షి మహారాజ్ గత వారంలో  మమతపై తీవ్ర ఆరోపనలు చేశారు.  జై శ్రీరాం అన్నందుకు హిరణ్యకశ్యపుడు తన  కొడుకు ప్రహ్లాదుడినే చంపాడని ఆయన  గుర్తు చేశారు. బెంగాల్ లో ఇదే రకమైన  పురాణ గాధ బెంగాల్ లో పునరావృతమైందని ఆయన ఆరోపించారు.

2014 ఎన్నికల్లో రెండు స్థానాలకే బీజేపీ పరిమితమైంది. కానీ, ఇటీవల ఎన్నికల్లో బీజేపీ 18 ఎంపీ స్థానాలను బెంగాల్ లో దక్కించుకొంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత  బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య పరస్పర దాడులు చోటు చేసుకొంటున్నాయి.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !