అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా... ఎంపీ సుమలత

By telugu teamFirst Published Jun 10, 2019, 1:46 PM IST
Highlights

సినీ నటి సుమలత ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా...  కేవలం పోటీ చేసి తొలి ఎన్నికల్లోనే ఆమె తన సత్తా చాటారు. 

సినీ నటి సుమలత ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి అనుభవం లేకపోయినా...  కేవలం పోటీ చేసి తొలి ఎన్నికల్లోనే ఆమె తన సత్తా చాటారు.  కాగా.. అసలు తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి గల కారణాన్ని ఆమె తాజాగా వివరించారు. 

అప్పటి వరకు తన భర్త అంబరీష్ సహాయం పొందిన చాలా మంది... ఆయన చనిపోగానే తనపై బెదిరింపులకు పాల్పడ్డారని సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి కానీ.. పదవులను అనుభవించాలనే కోరికలు లేవని చెప్పారు. కేవలం కొందరికి బుద్ధి చెప్పేందుకే తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టానని చెప్పారు.

అంబరీష్ మరణం తర్వాత రాజకీయాల్లోకి రావాలని తనను చాలా మంది కలిశారని ఆమె చెప్పారు. అయితే.. రాజకీయాలు అంత సులువు కాదని, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అంతలోనే జేడీఎస్‌కు చెందిన ముఖ్యులు (మంత్రి రేవణ్ణ) నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. చివరకు బెదరింపులకు దిగారన్నారు. 

భర్త కోల్పోయిన ఓ మహిళ పట్ల కనీస సానుభూతి చూపలేదన్నారు. ఇలా అనుచితంగా మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకనే రాజకీయ ప్రవేశం చేశానన్నారు. అంబరీశ్‌ సత్తా ఏంటో చూపుదామనే స్వతంత్రంగా పోటీ చేశానన్నారు. నటులు దర్శన్‌, యశ్‌లు, నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌ లు  నా వెన్నంటే ఉండి.. విజయానికి సహకరించారని చెప్పారు. 

click me!