షాకింగ్ ఘ‌ట‌న‌: కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని మేన‌కోడ‌లి హ‌త్య

Published : May 07, 2023, 03:04 AM IST
షాకింగ్ ఘ‌ట‌న‌: కులాంత‌ర వివాహం చేసుకుంద‌ని మేన‌కోడ‌లి హ‌త్య

సారాంశం

Sitapur: కులాంతర వివాహం చేసుకున్నందుకు మేనకోడలు ప్రాణాలు తీశాడు ఒక వ్య‌క్తి. ఈ దారుణానికి ఒడిక‌ట్టిన త‌ర్వాత నేరుగా పోలీసు స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది.  

UP Man Slits Niece's Throat: మ‌రోసారి ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం రేపింది. కులాంత‌ర వివాహం చేసుకుందని మేన‌కోడ‌లు ప్రాణాలు తీశాడు ఒక వ్య‌క్తి. ఈ దారుణాకి ఒడిక‌ట్టిన త‌ర్వాత నేరుగా పోలీసు స్టేష‌న్ కు వెళ్లి లొంగిపోయారు. ఈ షాకింగ్ ఘ‌ట‌న ఉత్త‌రప్ర‌దేశ్ లో చోటుచేసుకుంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. 

వివ‌రాల్లోకెళ్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లం రేపింది. ఇంటి నుంచి పారిపోయి వేరే కులానికి చెందిన వ్య‌క్తిని వివాహం చేసుకుంద‌ని ఒక‌ వ్యక్తి తన మేనకోడలి ప్రాణాలు తీశాడు. ప‌దునైన ఆయుధంలో ఆమెపై దాడి చేసి ప్రాణాలు బ‌లిగొన్నాడు. హత్యా ఆయుధం కొడవలితో ఆ వ్యక్తి మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఈ ఘటన పిసావన్ పోలీస్ సర్కిల్ పరిధిలోని బాజ్ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.

సీతాపూర్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఎన్పీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్య అనే వ్యక్తితో 20 ఏళ్ల యువతికి ప్రేమ వ్య‌వ‌హారం న‌డుస్తోంది. వీరి సంబంధం గురించి యువతి మేనమామ శ్యాము సింగ్ కు తెలియడంతో ఆమెను ఆమె తండ్రి పూతన్ సింగ్ తోమర్ పనిచేసే ఘజియాబాద్ కు పంపించాడు. అయితే కొన్ని నెలల తర్వాత మౌర్య ఘజియాబాద్ చేరుకోవడంతో అతడు, మహిళ పరారయ్యారు. గత ఏడాది నవంబర్ లో కోర్టులో వీరి వివాహం జరిగిందని ఎన్పీ సింగ్ తెలిపారు.

మౌర్య, మహిళ కొద్ది రోజుల క్రితం గ్రామానికి తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. శనివారం శ్యాము సింగ్ దంపతులు నివసిస్తున్న ఇంటికి చేరుకుని మహిళను బయటకు గింజుకొచ్చి ఆమెపై దాడి చేశాడు. ప‌దునైన ఆయుధంతో కొట్ట‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు శ్యాము సింగ్ హత్యా ఆయుధంతో పాటు పిసావన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడని ఎన్పీ సింగ్ తెలిపారు. అప్పటికే వివాహమై వేరే కులానికి చెందిన వ్యక్తిని ఆమె పారిపోయి పెళ్లి చేసుకున్నందునే ఆమెను హత్య చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ సింగ్ ను అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్