భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. షాక్ లో పాక్

Published : Apr 02, 2022, 03:52 PM IST
భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు.. షాక్ లో పాక్

సారాంశం

Imran Khan praised Modi’s foreign policy: భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. దీంతో పాకిస్థాన్ ప్రజలు షాక్ గురికావడంతో పాటు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   

Imran Khan praised Modi’s foreign policy: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ దేశ ప్రజలను షాక్ గురిచేశాయి. దాయాది భారత్ పై చేసిన ఆయన వ్యాఖ్యలపై పాక్ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. వేలాది మంది తన మద్దతుదారుల ముందు పాకిస్థాన్  ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్ని ప్రశంసించాడు. దీంతో పాకిస్థాన్ రాజకీయ నాయకులతో సహా అక్కడి ప్రజలు ఆశ్చర్యపోయారని ఆ దేశ మీడియా పేర్కొంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని మలాకాండ్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో  ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానాన్నిఇమ్రాన్ ఖాన్  ప్రశంసించారు.

ఆ బహిరంగా ర్యాలీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. “మన పొరుగు దేశం హిందుస్థాన్ విదేశాంగ విధానాన్ని నేను ప్రశంసించాలనుకుంటున్నాను. భారతదేశ విదేశాంగ విధానం స్వేచ్ఛగా మరియు స్వతంత్రంగా ఉంది మరియు దాని ఏకైక లక్ష్యం దాని స్వంత ప్రజల అభివృద్ధి అనుగుణంగా ముందుకు సాగ‌ట‌మే”  అని పేర్కొన్నారు. “ఒకప్పుడు భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని హిట్లర్ అని, అంతర్జాతీయ వేదికలపై నాజీ నాయకుడని ఎగతాళి చేసిన ఇమ్రాన్ ఖాన్, ఇప్పుడు ఆయన విదేశాంగ విధానాన్ని ప్రశంసించడం ఆశ్చ‌ర్యానికి గురించేసింది” అని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. 

పాకిస్థాన్ సంప్రదాయ మిత్రులైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్ వంటి దేశాలతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్నేహపూర్వక సంబంధాలను ఏర్పరచుకున్నారు. సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు రుణాలు ఇవ్వడం ఆపివేసింది, పాకిస్తాన్‌ను ప్రోత్సహిస్తున్నప్పటికీ యుఎఇ కాశ్మీర్ సమస్యను లేవనెత్తడం మానేసింది. "చాలా ఇస్లామిక్ దేశాలు ఇప్పుడు భారతదేశం పట్ల తమ వైఖరిని మార్చుకున్నాయి మరియు పాకిస్తాన్‌లోని ప్రతిపక్ష నాయకులు కూడా ఇప్పుడు మోడీని ఉదాహరణగా చెప్పవద్దని వారి ప్రధానమంత్రిని అడగడం మొదలుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ అసమర్థత వల్లే ప్రపంచం ఇప్పుడు పాకిస్థాన్‌ను చూసి నవ్వుతోందని ఈ ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు అని నివేదిక పేర్కొంది.

భారత విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ ష్రింగ్లా.. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ ఖాన్ వ్యాఖ్యపై  స్పందిస్తూ.. “భారతదేశం తన విదేశాంగ విధానం కోసం వివిధ దేశాల నుండి ప్రశంసలు అందుకుంది మరియు మా రికార్డు దాని గురించి మాట్లాడుతుంది. భారత విదేశాంగ విధానాన్ని ఒకే ఒక్క నాయకుడు ప్రశంసించారని చెప్పడం తప్పు అని పేర్కొన్నారు. 

కాగా,  ప్రస్తుతం పాకిస్థాన్ లో రాజ‌కీయాలు, అక్క‌డి ప‌రిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని విశ్వసనీయ సమాచారం ఉందనీ, అయితే తాను భయపడేది లేదని, స్వతంత్ర మరియు ప్రజాస్వామ్య పాకిస్థాన్ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఇమ్రాన్ ఖాన్ స్ప‌ష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో ఆదివారం అవిశ్వాస తీర్మానానికి ముందు ఓ మీడియా ఛాన‌ల్ కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. శక్తివంతమైన మిలిటరీ తనకు మూడు ఎంపికలను ఇచ్చిందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. త‌న ముందు  అవిశ్వాసం తీర్మానం, ముందస్తు ఎన్నికలు, ప్రధానమంత్రి పదవికి రాజీనామా అనే ఆప్ష‌న్లు ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు సైతం ఆ విదేశీ శ‌క్తుల‌తో చేతులు క‌లిపాయ‌ని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu