బాబు కలలు కల్లలే.. కూటమి ఏర్పాటుపై శివసేన ఫైర్

By Siva KodatiFirst Published May 20, 2019, 3:21 PM IST
Highlights

లోక్‌సభ ఎన్నికలపై ఆదివారం రాత్రి విడుదలైన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల తర్వాత దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ క్రమంలో ఎన్డీఏలో కీలక మిత్రపక్షం శివసేన ప్రతిపక్ష పార్టీలపై విమర్శల వర్షం కురిపించింది. 

మహాకూటమిలోని ఐదుగురు నేతలు ప్రధానమంత్రి కావాలని ఆశిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలపై తాజాగా వచ్చిన అంచనాలతో వారి ఆశలు నీరుగారిపోయాయంటూ అధికారిక పత్రిక సామ్నాలో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో వారి ఆశలు నీరుగారిపోయాయి. పలు చిన్న పార్టీలను బలవంతంగా కలిపి ఏర్పాటు చేయాలనుకుంటున్న కూటమి ప్రభుత్వాన్ని భరించే స్థితిలో ప్రస్తుతం దేశం లేదని పేర్కొంది.

కేంద్రంలో మరో సారి బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడదని ప్రతిపక్షాలు భావించాయి. దీంతో వారు దేశంలో వీలైనన్ని పార్టీలను కలిపి బీజేపీని అధికారానికి దూరం చేయాలని భావిస్తున్నాయి.. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

కానీ ఆయన ప్రయత్నాలు నిష్ఫలం కానున్నాయి. ఢిల్లీలో ఆయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను రెండుసార్లు కలిశారు. అయితే మే 23 సాయంత్రం వరకు కూడా వారి కూటమి చెక్కు చెదరకుండా ఉంటుందన్న గ్యారంటీ లేదని వెల్లడించింది. 

click me!