కమల్‌నాధ్ ప్రభుత్వానికి ఎసరు: గవర్నర్‌కు బీజేపీ లేఖ

By narsimha lodeFirst Published May 20, 2019, 3:19 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.... విశ్వాసాన్ని నిరూపించుకొనేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని  బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ అనందీ‌బెన్ పటేల్‌కు సోమవారం నాడు లేఖ రాసింది.

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనార్టీలో పడిందని.... విశ్వాసాన్ని నిరూపించుకొనేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని  బీజేపీ మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌ అనందీ‌బెన్ పటేల్‌కు సోమవారం నాడు లేఖ రాసింది.

గత ఏడాది మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొంది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 114 ఎమ్మెల్యేలు ఉన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కనీసం 116 ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి.  బీఎస్పీకి చెందిన ఇద్దరు, ఎస్పీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. బీజేపీకి 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

రైతులకు రుణ మాఫీతో పాటు ప్రభుత్వం బలం నిరూపించుకొనేందుకు గాను ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని గవర్నర్‌కు బీజేపీ నేత గోపాల్ భార్గవ డిమాండ్ చేశారు. 

ఎగ్జిట్ ఫలితాలు వెలువడిన కొన్ని గంటల్లోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్‌కు బీజేపీ లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకొంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి 20 ఎంపీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేల్చాయి.బీఎస్పీకి చెందిన లోకేంద్ర సింగ్ రాజ్‌పుత్  ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఎస్పీలో చేరారు. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.

click me!