
పంజాబ్ రాష్ట్రం మొహాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సీఎం అమరీందర్ సింగ్ ఇంటిని ముట్టడించారు శిరోమణి అకాలీదళ్ కార్యకర్తలు. రోడ్డుకు అడ్డుంగా పెట్టిన బారికేడ్లను తొలగించి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కోవిడ్ కిట్ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది నిరసనకారులు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించి అకాలీదళ్ కార్యకర్తలను చెదరగొడుతున్నారు. ఈ ఆందోళనల్లో పాల్గొన్న ప్రతిపక్షనేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌ను కూడా అరెస్ట్ చేశారు.