వ్యాక్సిన్ తో తొలి మరణం.. ధృవీకరించిన కేంద్రప్రభుత్వం..

By AN TeluguFirst Published Jun 15, 2021, 2:13 PM IST
Highlights

వ్యాక్సిన్ కారణంగా ఓ వ్యక్తి మరణించినట్టుగా మొదటిసారిగా కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం గుర్తించిన తొలిమరణం ఇదే. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఓ 68 ఏళ్ల వ్యక్తి మార్చి 31 న మరణించాడు.

వ్యాక్సిన్ కారణంగా ఓ వ్యక్తి మరణించినట్టుగా మొదటిసారిగా కేంద్రప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం గుర్తించిన తొలిమరణం ఇదే. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న ఓ 68 ఏళ్ల వ్యక్తి మార్చి 31 న మరణించాడు.

జనవరిలో ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుండి 31 తీవ్రమైన కేసులు నమోదయ్యాయని ఒక నివేదికలో పేర్కొంది. వ్యాక్సిన్ వల్ల రియాక్షన్ తో నమోదైన కేసులుగా వీటిని గుర్తించింది. అయితే  ఈ 31 కేసుల్లో ఇప్పటివరకు 28 మరణాలు ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇమ్యునైజేషన్ (AEFI) కమిటీ  ఈ నివేదికను తయారు చేసింది. 

దీని ప్రకారం..  "వ్యాక్సిన్ అనాఫిలాక్సిస్ రియాక్షన్ కారణంగా సంభవించిన మొదటి మరణం ఇది. వ్యాక్సిన్ వల్ల కలిగే ఈ రియాక్షన్లు చాలా తక్కువ మొత్తంలోనే నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 31 కేసులు గుర్తించబడ్డాయి. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే చనిపోయిన వారిగా ఒకరిని గుర్తించాం. ఇంక మిగతా అనాఫిలాక్సిస్ కేసుల్లో, రెండు మాత్రమే ప్రొడక్ట్ రిలేటెడ్ ఉన్నాయని’’ తెలిపింది. 

ఈ 31 కేసులలో, మూడు కేసులు "అనాఫిలాక్సిస్" లేదా వ్యాక్సిన్ తీసుకున్న అరగంట తర్వాత వ్యక్తిలో కనిపించిన తీవ్ర రియాక్షన్ గా గుర్తించబడ్డాయి. వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చేరి, చికిత్స తరువాత  డిశ్చార్జ్ అయ్యారు. కానీ ఒకరు మరణించారు.

ఇక వీటిలో పద్దెనిమిది కేసులు వ్యాక్సిన్లతో సంబంధం లేనివిగా గుర్తించబడ్డాయి. వీటిని "యాదృచ్చికం"గా జరిగిన మరణాలుగా వర్గీకరించారు. వ్యాక్సిన్ల వల్లే అనుకుంటున్న మరో రెండు కేసులు వ్యాక్సిన్లతో 
ఆసుపత్రిలో  ఉన్నాయి.

మరో ఏడు కేసులలో, మరణాలను వ్యాక్సిన్లతో అనుసంధానించడానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. రెండు కేసుల విషయంలో, తగినంత సమాచారం లేదు. అయితే టీకాల వల్ల కలిగే ప్రయోజనాలతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటూ మరణించినట్టు.. అది వ్యాక్సిన్ వల్లే రియాక్షన్ అయినట్టుగా ఇప్పటివరకు రిపోర్టులు లేవు. అంతేకాదు ఏప్రిల్ మొదటి వారం నుండి సేకరించిన డేటా ప్రకారం రిపోర్టింగ్ రేటు మిలియన్ వ్యాక్సిన్ మోతాదుకు 2.7 మరణాలు, కాగా మిలియన్ వ్యాక్సిన్ మోతాదుకు 4.8 మంది ఆస్పత్రుల్లో చేరినట్టుగా నమోదయ్యిందని "మంత్రిత్వ శాఖ వివరించారు.
 

click me!