షిర్డీ సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది.. అన్ని సేవలు యథాతథం: సంస్థాన్ సీఈవో

Published : Apr 28, 2023, 05:52 PM IST
షిర్డీ సాయిబాబా ఆలయం తెరిచే ఉంటుంది.. అన్ని సేవలు యథాతథం: సంస్థాన్ సీఈవో

సారాంశం

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటించాలని అక్కడి స్థానికులు నిర్ణయం తీసుకన్నారు. దీంతో సాయిబాబా ఆలయంలో దర్శనానికి సందర్శకులను అనుమతిస్తారా? లేదా? అని అనుమానాలు మొదలయ్యాయి.

మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ పాటించాలని అక్కడి స్థానికులు నిర్ణయం తీసుకన్నారు. దీంతో సాయిబాబా ఆలయంలో దర్శనానికి సందర్శకులను అనుమతిస్తారా? లేదా? అని అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్‌ఎస్ఎస్‌టీ) స్పందించింది. శ్రీ సాయిబాబా సంస్థాన్ అన్ని సేవలు మే 1 నుంచి యథావిథిగా తెరిచి ఉంటాయని తెలిపింది. షిర్డీ సాయిబాబా  ఆలయం తెరిచే ఉంటుందని స్పష్టం చేసింది. యథావిథిగా అన్ని  హారతులను ఇస్తామని తెలిపింది. 

అదేవిధంగా సంస్థాన్‌లోని అన్ని శ్రీ సాయి ప్రసాదాలయాలు, భక్తుల నివాసాలు, అన్ని ఆసుపత్రులు తదితర సౌకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ వెబ్‌సైట్‌లో సంస్థాన్ ఇంచార్జ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ పేరుతో ఒక ప్రకటనను ఉంచారు. 

ఇక, సాయి మందిరం భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)ని మోహరించాలనే నిర్ణయానికి నిరసనగా  మే 1వ తేదీ నుంచి నిరవధిక బంద్ షిర్డీ వాసులు నిర్ణయం తీసుకున్నారు.  గ్రామస్తులు స్వయంగా బంద్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారని..  అన్ని దుకాణాలు మూసివేయబడతాయని  తెలిపారు.  స్థానిక దుకాణాల యజమానుల సంఘం, రవాణాదారులు, వాణిజ్య సంస్థలు, ఆతిథ్య పరిశ్రమలోని ప్రజలు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. మతపరమైన పుణ్యక్షేత్రం ద్వారా ఎదురయ్యే ప్రత్యేక భద్రతా సవాళ్లను నిర్వహించడానికి సీఐఎస్ఎఫ్ శిక్షణ పొందలేదని వారు పేర్కొంటున్నారు.

సీఐఎస్‌ఎఫ్ ప్రధానంగా పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించే దళం.. ఆలయ భద్రతను నిర్వహించడానికి అది సన్నద్ధం కాలేదని వారు పేర్కొన్నారు.  మే 1 నుంచి నిరవధిక బంద్‌కు నిర్ణయించామని.. తదుపరి కార్యచరణను అదే  రోజు సమావేశమై నిర్ణయిస్తామని చెబుతున్నారు. అయితే  సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీని వ్యతిరేకిస్తున్న షిర్డీ గ్రామస్తులు మరికొన్ని డిమాండ్లను  కూడా తెరమీదకు తీసుకువచ్చారు. 
 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..